ఎట్టకేలకు పవన్ ను గుర్తించారు, పోటీ చేస్తాడా...

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎట్టకేలకు గుర్తింపు లభించింది.జన సేన పార్టీ కి రాజకీయ పార్టీగా తెలంగాణ ఎన్నికల కమిషన్ గుర్తింపునిచ్చింది.

 Pawan Kalyan’s Jana Sena Officially A Party-TeluguStop.com

జనసేన పార్టీని రిజిస్ట్రర్ చేసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం అధికారికంగా ప్రకటించింది.

జనసేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలంటూ పవన్ కల్యాణ్ గతంలో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే పవన్ పార్టీకి గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే టీడిపి, కాంగ్రెస్ లాగా ‘ప్రత్యేక గుర్తు లేని’ రాజకీయ పార్టీగా జనసేన వుండబోతోంది.

ఎన్నికల్లో పోటీ చేసి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు, ఓట్లు సంపాదిస్తే భవిష్యత్తులో ప్రత్యేక గుర్తు గల రాజకీయ పార్టీగా జనసేనకు గుర్తింపు లభించే అవకాశముంది.

పార్టీ కు గుర్తింపు వచ్చిన నేపథ్యంలో త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొలిటికల్ పార్టీగా జనసేన బరిలో దిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు .వరంగల్‌ ఉప ఎన్నిక, నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నిక లలో కూడా జన సేన పోటీ చేయాలని పవన్ ఫాన్స్ కోరుతున్నారు .గతంలోనే పవన్‌కల్యాణ్ సూచన‌ప్రాయంగా ఈ అంశాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube