పవన్ ఆ ప్రకటన..కొంప ముంచేలా ఉందిగా...!!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నాడని, అతడే కింగ్ మేకర్ అవుతాడని పలువురు విశ్లేషకులు అంచనాలు వేస్తూ వచ్చారు.పవన్ కళ్యాణ్ సైతం మొదట్లో ఏపీలో మనం లేనిదే ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదని చెప్పుకొచ్చాడు.

 Pawan Kalyans Inconsistent Political Agenda Might Make In Trouble-TeluguStop.com

ఈ తరుణంలోనే ప్రతీ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలి, ప్రతీ ఒక్కరికి టిక్కెట్టు అవకాశం కలిపిస్తామని అందుకు తగట్టుగా అభ్యర్ధులు ఎంతో నీటి నిజాయితీలతో ఉండాలని.స్వచ్చంద సేవకులకి కూడా ప్రాధాన్యత ఇస్తామని , దాదాపు 10 వేల ఓట్లు వచ్చేలా ప్రజాదరణ ఉన్న వారికి టిక్కెట్ల ఇవ్వడం ఖాయమని ప్రకటించారు.అంతేకాదు

రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి అభ్యర్ధులని ఎంపిక చేయడానికి స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.అభ్యర్ధులు ఎంపికకి షరతులు కూడా పెట్టారు.అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ కి తలనెప్పి మొదలయ్యింది.స్వచ్చంద సేవకులు, యువ పారిశ్రామికవేత్తలు , ఇలా ఎవరైనా ప్రజలలో ప్రభావం చూపే వాళ్ళు ఉంటే రండని పులుపు ఇచ్చిన తరుణంలో అలాంటి వారి నుంచీ అభ్యర్ధన పత్రాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయట.

మరి పిలిచినపుడు వస్తారు అందులో తలనెప్పి ఏముంది అనుకుంటున్నారా.?? అసలు విషయం ఏమిటంటే.అభ్యర్ధులు ఎవరైనా సరే దాదాపు 10 వేల మందిని ప్రభావితం చేయగలిగి ఓట్లు పడేలా ఉంటె టిక్కట్లు ఇస్తామని తెలిపారు పవన్.కాని ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులలో దాదాపు 10 మంది అభ్యర్ధులు పవన్ చెప్పిన 10వేల ఒట్లకి రీచ్ అవుతున్నారట, వారిని తమ అభ్యర్ధిగా స్వీకరించే అన్ని క్వాలిటీ లు ఉన్నాయట.అసలు చిక్కల్లా

సదరు వ్యక్తుల వద్ద కనీస డబ్బు కూడా లేకపోవడమే.రాజకీయాలలో గెలుపు పొందాలంటే డబ్బు తప్పని సరి అందులోనూ కాలు తీసి బయట పెట్టి మళ్ళి ఇంట్లో కాలు పెట్టేసరికి లక్షల రూపాయలు ఒక రోజుకి ఖర్చు అవుతుందని.మరి స్వచ్చంద సేవ చేసుకునే వారి వద్ద ఎన్నికల్లో ఖర్చు చేయడానికి కోట్ల రూపాయలు ఎలా ఉంటాయి.మరి వారికి ఎలాంటి ఆధారాన్ని పవన్ కళ్యాణ్ చూపిస్తారు.

సరే ఏదన్నా అప్పో సొప్పో చేసి ఎన్నికల్లో నిలబడితే తలరాత బాగోక ఓడిపోతే నష్ట పోయిన మొత్తం ఎవరు ఇస్తారు, మరి అసలే స్వచ్చంద సేవ చేసుకునే వాళ్ళు తరువాతి భవిష్యత్తు ఎలా.?? పవన్ వారికి భరోసా ఇస్తారా.లేదా స్వచ్చంద సేవ, డబ్బు లేకపోయినా ప్రభావం చూపగలిగే అభ్యర్ధుల కోసం కోసం పవన్ కళ్యాణ సొంత డబ్బులు ఖర్చు చేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నించే పార్టీకి అతి పెద్ద ప్రశ్నగా మారిపోయింది.మరి ఈ విషయంలో సందేహాలు తొలగి పోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ పండితులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube