కొత్త సీసాలో పాత నీరు..అన్న బాటలోనే     2018-09-17   13:49:57  IST  Bhanu C

జనసేన అధ్యక్షుడు తప్పటడుగులు వేస్తున్నాడా..? చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ ఫ్యాన్స్ సైతం లోలోపల మధన పడుతున్నారా..? రాజకీయాల్లో నూతన ఒరవడిని తీసుకువస్తాను అని చెప్పిన పవన కళ్యాణ్ ఇప్పుడు కొత్త సీసాలో పాతనీరు అన్నచందంగా పార్టీ ని ముందుకు తీసుకు వెళ్తున్నారా..? అసలు పవన్ ఇచ్చిన వాగ్ధానం ఏమిటి చేపడుతున్న చర్యలు ఏమిటి అనే విషయాలని ఒక్క సారి పరిశీలిస్తే ఫ్యాన్స్ పవన్ పై ఎంత గుర్రుగా ఉన్నారో అర్థం అవుతుంది..ఇక అసలు విషయంలోకి వెళ్తే..

రాజకీయాల్లో కొత్త తరహా రాజకీయాలు చేస్తాను రాజకీయాల తలరాతలు మార్చేస్తాను అని చెప్తున్న పవన్ కళ్యాణ్ సామాన్యుడే నా ఆయుధం..వారికే జనసేనలో చోటు యువతకి పెద్ద పీట వేస్తాను అని చెప్పి ఇప్పుడు ఫిరాయింపు దారులని అందలం ఎక్కిస్తున్నాడు రాజకీయాల్లోకి యువత రండి మీకు నేను ఉన్నాను అంటూ గొంతు చించుకుని చెప్పే పవన్ కళ్యణ్ ఇప్పుడు టీడీపీ ,వైసీపీ లోని అసమ్మతి నేతలకి గేలం వేస్తున్నారు. సిద్దాంతాలు నీతులు చెప్పడానికే తప్ప ఆచరణలోకి పనికి రావని తన అన్నలాగా మరో సారి నిరూపించారు పవన్ కళ్యాణ్..

ఇప్పటి జనసేన తాజా వ్యుహాలని బట్టి చూస్తే పెద్దగా వ్యూహలు వేయకుండా చాలా కూల్ గ చాపకింద నీరులా అసమ్మతి నేతలకి గేలం వేస్తున్నట్టుగా కనిపిస్తోంది… ప్రధాన పార్టీల్లోంచి నేతలను ఏరుకుంటూ కొత్త సీసాలో పాత సారా నిపుతున్నాడు జనసేనాని.. తటస్తులు, విద్యావంతులు, రాజకీయాల పట్ల మక్కువ ఉన్న యువతకి పవన్ అవకాశం ఇస్తారని అనుకుంటే పవన్ కళ్యాణ్ జనసేనాని మొదటి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పితాని బాలకృష్ణ ని ప్రకటించి భవిష్యత్తులో జనసేన మార్గం ఇలా ఉంటుందని ఒక క్లారిటీ ఇచ్చేశారు..

ముమ్మిడివరం తొలి టికెట్ తీసుకున్న పితాని బాలక్రిష్ణ వైసీపీ నాయకుడు..దాదాపు కోట్లలోనే ఆయన జేబూ వైసీపీలో ఖాళీ అయ్యింది చివరికి వైసేపీ హ్యాండ్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన జనసేన లోకి జంప్ చేశారు..ఇక ఇదే జిల్లాలో రాపాక ప్రసాదరావు కు కూడా టికెట్ కన్ ఫర్మ్ అంటున్నారు. అలాగే ఇదే జిల్లాలో నలుగుతున్న అనేక పేర్లు టీడీపీ, వైసీపీ నుంచి అసమ్మతి పేరు చెప్పి రాబోయే వారే కనిపిస్తున్నారు..ఇక విశాఖ విషయానికి వస్తే.. టీడీపీలో ఉన్న సుందరపు విజయకుమార్ కి కూడా జనసేన టికెట్ ష్యూర్ అంటున్నారు ఇలా ప్రతీ చోటా బలంగా ఉంటూ టీడీపీ వైసీపీ లలో అసంతృప్తితో ఉన్న నేతలపై జనసేన దృష్టి సారిస్తోందని చెప్పకనే చెప్తున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్ మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణాత్మక మార్పులు చేర్పులు చేస్తాడో వేచి చూడాలి.