ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ పారితోషికం!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjevi ) తమ్ముడి గా పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది.ఇన్నేళ్లలో పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం ఏడాదికి ఒకటి చొప్పున సినిమాలు చేశాడు.

 Pawan Kalyan's Highest Paid Movie Details,pawan Kalyan,pawan Kalyan Remuneration-TeluguStop.com

కొన్ని సార్లు రెండు మూడు సంవత్సరాల గ్యాప్ కూడా తీసుకున్నాడు.కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.

ఒకే సారి నాలుగైదు సినిమాలకు కమిట్ అయ్యాడు… కమిట్‌ అవ్వడం మాత్రమే కాకుండా ఏక కాలంలో వాటి షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అన్ని సినిమాల షూటింగ్స్ సమాంతరంగా సాగుతున్నాయి.

క్రిష్( Krish ) దర్శకత్వం లో రూపొందుతున్న హరి హర వీరమల్లు( Hari hara veeramallu ) షూటింగ్ కార్యక్రమాలు సగానికి పైగా పూర్తయ్యాయి.ఈ నెల చివరి నుండి మళ్లీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఇక తమిళం లో సూపర్ హిట్ అయినా వినోదయ సీతం సినిమా రీమేక్ షూటింగ్ ని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పూర్తి చేశాడు.మరో వైపు సాహూ సుజిత్ దర్శకత్వం లో రూపొందిన.

రూపొందుతున్న సినిమా చిత్రీకరణ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

Telugu Chiranjeevi, Harihara, Harish Shankar, Pawan Kalyan, Telugu, Top, Ustaadb

ఎన్ని సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అనేది వెంటనే చెప్పలేని పరిస్థితి.ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ఏ సినిమా కు అత్యధిక రెమ్యూనరేషన్‌ అందుకుంటున్నాడు అనే విషయానికి వస్తే వినోదయ సీతం సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేటాయించిన డేట్లు చాలా తక్కువ… అందుకోసం ఆయన భారీగా రెమ్యూనరేషన్‌ అందుకున్నాడు.రోజుకు రెండు కోట్ల రూపాయల చొప్పున ఆయన పారితోషికం దక్కించుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

Telugu Chiranjeevi, Harihara, Harish Shankar, Pawan Kalyan, Telugu, Top, Ustaadb

కనుక ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అత్యధిక పారితోషికం పవన్ కళ్యాణ్ కి పీపుల్స్ మీడియా వారు ఇవ్వడం జరిగింది.ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వారు ఇస్తున్నారు.వారి నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.మొత్తానికి పవన్ కళ్యాణ్ సంవత్సర కాలంలోనే వందల కోట్ల రూపాయలు పారితోషికం రూపం లో అందుకుంటున్నాడు.

వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.ఆ ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగుతాడా లేదా అనేది తెలియదు.

కనుక ఈ లోపు సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube