కూడికలు .. తీసివేతలు ! పవన్ సరైన రాజకీయం 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికి సరైన నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు.  మొన్నటి వరకు రాజకీయాలంటే మొక్కుబడి తంతు అన్నట్లుగా ఆయన వ్యవహారం ఉండేది.

 Janasena Pawan Kalyan Effort To Unite All Castes Details,  Pavan Kalyan, Janasen-TeluguStop.com

  ఒక పక్క సినిమాలు,  మరో పక్క రాజకీయాలు ఇలా రెండు పడవలపై ఆయన ప్రయాణం కొనసాగిస్తూ, రాజకీయంగా బలపడ లేకపోయారు.ఇప్పటికీ పవన్ సినిమాలు చేస్తూనే ఉన్నా ఇప్పుడు రాజకీయంగా మైలేజ్ సాధించడంలో సక్సెస్ అయ్యారు.

గత కొద్ది రోజులుగా ఏపీ లో అనేక ప్రజా ఉద్యమాల్లో జనసేన నిమగ్నమైంది.రాజకీయంగా మైలేజ్ సాధించింది.ఇక టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలోనూ ఉంది.ఇదిలా ఉంటే మొన్నటి వరకు కులాల అంశాన్ని ప్రస్తావించేందుకు పవన్ కళ్యాణ్ ఇష్టపడేవారు కాదు.

ఒక వర్గానికి అనుకూలంగా మాట్లాడితే మిగతా వర్గాల నుంచి వ్యతిరేకత పెరుగుతుందనే ఆలోచనలో ఉండేవారు.దీంతో తన సామాజిక వర్గమైన కాపు కులాన్ని పెద్దగా పట్టించుకోనట్టుగా  వ్యవహరించేవారు.

అయితే రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే కేవలం ఉద్యమాలు, ఆందోళన లు మాత్రమే కాదని , సామాజిక వర్గాల వారీగా పట్టు సాధించగలిగితేనే,  రాజకీయంగా మైలేజ్ సాధించవచ్చనే అభిప్రాయానికి పవన్ వచ్చినట్టు గా కనిపిస్తున్నారు.అందుకే ఇటీవల రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో కాపులంతా ఒక్కటి కావాలంటూ పవన్ పిలుపు ఇచ్చారు.

అంతేకాదు కాపులు, బీసీలు కలిస్తేనే ఏపీలో పరిస్థితులను సమూలంగా మార్చవచ్చని పవన్ పిలుపునిచ్చారు.ఇక అన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చేలా రెడ్డి సామాజిక వర్గాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.
 

Telugu Ap, Chandrababu, Jagan, Janasenani, Kapu, Pavan, Pavan Kalyan, Pawan, Ysr

తనకు అన్ని కులాలలోను మిత్రులు ఉన్నారని,  తనకు కులమతాలు లేవంటూ గతంలో చెప్పిన మాటలను పక్కనపెట్టి ఇపుడు కులాల అంశాన్ని ప్రస్తావిస్తూ రాజకీయంగా మైలేజ్ పొందేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు.2019 ముందు వరకు టిడిపి కి అనుకూలంగా బీసీలు ఉండేవారు.  అయితే 2019 ఎన్నికల్లో బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపించడం తో, వైసిపి తిరుగులేని అధికారాన్ని దక్కించుకుంది.ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల వారిగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా అన్ని కులాలకు కార్పొరేషన్ చైర్మన్ లను జగన్ నియమించారు.
 

Telugu Ap, Chandrababu, Jagan, Janasenani, Kapu, Pavan, Pavan Kalyan, Pawan, Ysr

ఇప్పుడు అదే విధంగా కులాల అంశాన్ని ప్రస్తావించి, ఆయా  సామాజిక వర్గం వారిని తమ వైపు తిప్పుకునే విధంగా పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.ఏపీలో మెజార్టీ స్థాయిలో బీసీలు ఉన్నారు.ఆ తరువాతి స్థానంలో కాపు సామాజిక వర్గం ఉంది.ఈ రెండు కలిస్తే అధికారం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు అనే విషయాన్ని పవన్ కాస్త ఆలస్యంగానైనా గుర్తించినట్టుగా కనిపిస్తున్నారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube