పవన్ వ్యాఖ్యలపై కాపులకు కాలుతోందా ?  

Pawan Kalyan Comments On Kapu Cast Leaders-kapu Reservation,pawan Kalyan,ycp Leader Jagan Mohan Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ప్రతి విషయం మీద స్పందిస్తూనే ఉన్నారు.ఆయన రాజకీయం గా బాగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విషయం కూడా అందరికి అర్ధం అవుతోంది.

Pawan Kalyan Comments On Kapu Cast Leaders-Kapu Reservation Pawan Ycp Leader Jagan Mohan Reddy

తాజాగా తన సొంత సామాజిక వర్గం నాయకులపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.కాపులకు రిజర్వేషన్లు కావాలని కోరిన వైసీపీలోని కాపు నేతలు.

అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రిజర్వేషన్లు లేవని చెబుతూ, చంద్రబాబు ఈడబ్ల్యూయస్ రిజర్వేషన్లలో బాగంగా ఇచ్చిన అయిదు శాతం రిజర్వేన్లను జగన్ రద్దు చేసినా ప్రశ్నించే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు.తనకు రాజోలు పర్యటనలో ఒక పెద్దాయన కాపు నేతలు జగన్ ను చూసి భయపడుతున్నారని చెప్పారని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan Comments On Kapu Cast Leaders-Kapu Reservation Pawan Ycp Leader Jagan Mohan Reddy

కాపులకు ధైర్యం లేదని, అందుకే కాపులకు రిజర్వేషన్ అమలు చేయనని చెప్పినా జగన్ కు ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కాపు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టునే పవన్ చదువుతున్నారని వారు ఆరోపించారు.పవన్ విమర్శల వెనుక ఓర్వలేనితనం స్పష్టంగా కనిపిస్తోందని, అసలు పవన కు కాపులను బీసీల్లో కలిపే అంశం మీద అవగాహన ఉందా అంటూ ఆ సామజిక వర్గం నాయకులు మండిపడ్డారు.పవన్ గారూ మీరు మా సామాజిక వర్గంవారు కాదా మరి మీకు ధైర్యం లేదా, కాపులకు ధైర్యం ఎంత ఉందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు అంటూ మాజీ ఎమ్మెల్యే, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ విమర్శలు గుప్పించారు.

కాపులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయని ఆమంచి మండిపడ్డారు.ఇన్ని మాటలు చెబుతున్న పవన్ కల్యాణ్ కాపు ఉద్యమ సమయంలో ఎక్కడికి వెళ్లిపోయారంటూ మండిపడ్డారు.

ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడ్డానికి మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారంటూ మండిపడ్డారు.

 

పవన్ కు ఏ అంశంపైనా అవగాహన కాని, అనుభవం కాని లేదని, తన సినీమా యాక్టర్ గా ఆ ఇమేజ్ తో ఏదో చేయాలనుకుంటే అది రాజకీయాల్లో పనిచేయదని ఆమంచి విమర్శించారు.పవన్ గారు మీ నిజరూపం బయటపడుతోంది.రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి.మీరు కూడా తెలుగుదేశం నాయకుల్లా కళ్లకు గంతలు కట్టుకుని మాట్లాడుతున్నారు.మీరు పెయిడ్ ఆర్టిస్టుల జాబితాలో చేరిపోయారా అంటూ వైసీపీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు.

అసలు పవన కు కాపులను బీసీల్లో కలిపే అంశం మీద అవగాహన ఉందా అని మరికొంతమంది వైసీపీ నేతలు ప్రశ్నించారు.మరో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్ పాలనపై విమర్శలు చేసే నైతిక హక్కు పవన్ కల్యాణ్ కు లేదని మండిపడ్డారు.

తాజా వార్తలు

Pawan Kalyan Comments On Kapu Cast Leaders-kapu Reservation,pawan Kalyan,ycp Leader Jagan Mohan Reddy Related....