పవన్‌ ఖండించాడు, కాని ఆయన ఖండించడేం?  

Pawan Kalyan Comments On Ycp Party Leaders-janasena Mla Rapaka Varaprasada Rao,pawan Kalyan

జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ వైకాపాలో జాయిన్‌ కాబోతున్నాడు అంటూ నిన్నంత కూడా ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.రాపాక వర ప్రసాద్‌కు జనసేన పార్టీ నుండి షోకాజ్‌ నోటీస్‌ అందిందని, పార్టీ ఎమ్మెల్యే అయ్యి ఉండి అధినేత నిర్ణయాలు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ జనసేన నుండి ఆయన్ను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు అంటూ నిన్న ప్రచారం జరిగింది.

Pawan Kalyan Comments On Ycp Party Leaders-janasena Mla Rapaka Varaprasada Rao,pawan Kalyan Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Pawan Kalyan Comments On YCP Party Leaders-Janasena Mla Rapaka Varaprasada Rao

కాని అదంతా ఒట్టి పుకార్లే అంటూ జనసేన ప్రకటించింది.రాపాకకు షోకాజ్‌ నోటీసు ఇవ్వడం అనేది అవాస్తవం అంటూ వైకాపా నాయకులు ఈ విష ప్రచారం చేస్తున్నారంటూ పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నాడు.

పవన్‌ కళ్యాణ్‌ ఈ విషయమై మాట్లాడుతూ వైకాపా నాయకులు ఈ ప్రచారం చేశారని, ఆయన్ను బలహీన పర్చేందుకు ఎంతకైనా వారు దిగజారుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాపాక పార్టీ మారే విషయం పూర్తిగా అవాస్తవం అంటూ పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించాడు.

అయితే ఇప్పటి వరకు రాపాక వర ప్రసాద్‌ మాత్రం ఈ విషయమై ఎలాంటి స్పందన చేయడం లేదు.పార్టీ మారడం లేదు అంటూ ఆయన నోట మాట రావడం లేదు.

దాంతో అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.అసలు రాపాక పార్టీలో ఉంటాడా అనే అనుమానాలు మొదటి నుండే ఉన్నాయి.

ఇప్పుడు ఆ అనుమానాలు ఎక్కువ అయ్యాయి.

తాజా వార్తలు