టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భగవదీయుడు భగత్ సింగ్, హరిహర వీరమల్లు, అలాగే దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నారు.
హరిహర వీరమల్లు సినిమాకు రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హరిహర వీర మల్లు సినిమా పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా.
కాగా ఇప్పటివరకు పవన్ నటించ నటువంటి పాత్రలో ఈ సినిమాలో నటించబోతుండడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.అదే కాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తి అయ్యింది.
కానీ ఈ మధ్యలో కొన్ని రోజులుగా షూటింగ్ కీ కాస్త గ్యాప్ పడడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి రాదేమో అని పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడ్డారు.
కానీ ఈ విషయంపై స్పందించిన చిత్ర బృందం అలాంటిదేమీ లేదని అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేస్తామని ప్రకటించారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.ఇది ఇలా ఉంటే ఇటీవల ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ లో పవన్ కళ్యాణ్ న్యూ లుక్ కీ సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలలో పవన్ కళ్యాణ్ రెడ్డి కలర్ టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని న్యూ లుక్ లో కనిపించారు.అలాగే చేతికి వేసుకున్న వాచ్ గురించి ప్రస్తుతం అసలు మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ ధరించిన ఆ వాచ్ ఇటలీ సంస్థ అయినా పనేరాయ్ కంపెనీకి చెందినది.ఆ వాచ్ ధర అక్షరాల రూ.14,37,000.
.