జంపింగ్ లకు కారణం ఆయనేనా?  

Pawan Kalyan Wants To Focus On Nadendla Manohar-nadendla Manohar,party Jumping,pawan Kalyan,pawan Kalyan Janasena

జనసేన పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందినా ఆ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందన్న ఆశతోనూ, పవన్ మీద నమ్మకంతోనూ ఆ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు.అయితే జనసేనలో ప్రస్తుతం నాయకులకు అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు.ముఖ్యంగా పార్టీలో నాయకులకు తరచూ అవమానాలు జరుగుతుండడం, అదికూడా పవన్ కు అత్యంత సన్నిహితుల నుంచే కావడంతో వారి బాధ ఎవరికీ చెప్పుకోలేక పార్టీకి దూరం అవుతున్నారు.

Pawan Kalyan Wants To Focus On Nadendla Manohar-nadendla Manohar,party Jumping,pawan Kalyan,pawan Kalyan Janasena-Pawan Kalyan Wants To Focus On Nadendla Manohar-Nadendla Manohar Party Jumping Pawan Janasena

ఎన్నికల ముందు వరకు జనసేనలోకి వలసలు బాగానే వచ్చినా టిక్కెట్ల విషయంలో కొంతమందికి అన్యాయం జరిగిందనే భావన వ్యక్తమైంది.మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వడంతో అసంతృప్తి రేగింది.

Pawan Kalyan Wants To Focus On Nadendla Manohar-nadendla Manohar,party Jumping,pawan Kalyan,pawan Kalyan Janasena-Pawan Kalyan Wants To Focus On Nadendla Manohar-Nadendla Manohar Party Jumping Pawan Janasena

అయితే ఆ తరువాత తరువాత అది కాస్త సద్దుమణిగింది.

ముఖ్యంగా జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ చేరిన దగ్గర నుంచి లుక లుకలు మొదలైనట్టు కనిపిస్తోంది.అయన జనసేనలో చేరక ముందు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా అది కాదనుకుని మరి జనసేన లో చేరారు.

ఇక అప్పటి నుంచి ఆయనకు పార్టీలో ఎక్కడ లేని ప్రాధాన్యత దక్కింది.ముఖ్యంగా పార్టీలో పవన్ తర్వాత నాదెండ్ల మనోహరే అన్నట్టుగా ఆయన హవా నడుస్తూ ఉండడం పవన్ ఆందరికంటే ఎక్కువ ఆయనకే ప్రాధాన్యం ఇవ్వడం ఇవన్నీ మిగతా నాయకుల్లో అసంతృప్తిని రాజేశాయి.ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులు దీనిపై గుర్రు గా ఉండడమే కాకుండా తమను పవన్ పట్టించుకోవడంలేదని బాధతో పార్టీని వదిలి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు.

ఎన్నికలకు ముందే విజయ్ బాబు, అద్దేపల్లి శ్రీధర్ వంటి కీలకమైన వారు పార్టీని వదిలి వెళ్లారు.ఆ తరువాత పవన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన మారిశెట్టి రాఘవయ్య కూడా రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు.

ఇక ఈ విధంగానే ఒక్కో నేత వలస బాట పడుతూ వస్తున్నారు.

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, కృష్ణాజిల్లా జనసేన పార్టీ కన్వీనర్ డేవిడ్ రాజు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల పార్థసారథి, కావలి, పెదకూరపాడు తణుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన పసుపులేటి సుధాకర్, దండమూడి సామ్రాజ్యం, పసుపులేటి వెంకట రామారావు, ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు జనసేన కు రాజీనామా చేశారు.అయితే నాయకులు ఈ విధంగా పార్టీని వీడి బయటకు వెళ్ళి పోతూ ఉండడంతో పవన్ లో అంతర్మధనం మొదలైందట.దీనిపై అసలు విషయం ఆరా తీయగా ఈ పరిస్థితులకు కారణం నాదెండ్ల మనోహరే కారణమని పవన్ దృష్టికి వచ్చినట్టు సమాచారం.

దీంతో ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయన మీద పెట్టి పార్టీని ప్రక్షాళన చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నట్టు తాజాగా పార్టీలో జరుగుతున్న చర్చ.