ఆ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయరా..?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ పింక్ సినిమాకు రీమేక్ అయినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Wants To Stop Movies After 2023-TeluguStop.com

పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్, హరిహరవీరమల్లు సినిమాలలో నటిస్తుండగా హరీష్ శంకర్ సినిమా మొదలుకాకుండానే ఈ సినిమాకు సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల క్రితమే జనసేన పార్టీని స్థాపించిన సంగతి విదితమే.

 Pawan Kalyan Wants To Stop Movies After 2023-ఆ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయరా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావాలని భావిస్తున్నారు.ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల షూటింగ్ పూర్తి కావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల తర్వాత పవన్ మరో సినిమాకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఆ తర్వాత సినిమాలు చేయరని సమాచారం.

2024 ఎన్నికల ఫలితాలను బట్టి పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telugu 2023, Active In Politics, Ayyappanum Koshiyum, Hareesh Shankar, Hari Hara Veera Mallu, Janasena Party, Pawan Kalyan, Pawan Movies, Pawan Stop Movies, Shocking Decision-Movie

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు.సినిమాల షూటింగ్ పూర్తైన తరువాత పవన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని యాక్టివ్ చేసుకోవాలని భావిస్తున్నారు.2019 ఎన్నికల్లో పవన్ రెండు స్థానాల్లో పోటీ చేసినా ఎన్నికల్లో విజయం సాధించలేదు.

2024 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

Telugu 2023, Active In Politics, Ayyappanum Koshiyum, Hareesh Shankar, Hari Hara Veera Mallu, Janasena Party, Pawan Kalyan, Pawan Movies, Pawan Stop Movies, Shocking Decision-Movie

పవన్ 2023 నుంచి పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.అయితే పవన్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.ప్రస్తుతం ఏపీలో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పని చేస్తున్నాయి.

బీజేపీ జనసేన కూటమి విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంది.

#HariHara #2023 #Pawan Kalyan #Pawan Movies #Janasena Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు