తెలంగాణలోనూ పవన్ టూర్..అన్ని స్థానాల్లో పోటీ చేస్తాడా..  

ఏపీలో వరుస పర్యటనలు చేస్తూ ..అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చూపు ఇప్పుడు తెలంగాణ మీద కూడా పడినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఏపీలో యత్ర పూర్తవగానే తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా రాజకీయ సంచలనం సృష్టించబోతున్నారు అంటూ జనసేన వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తెలంగాణాలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి..? అక్కడ ఎన్ని స్థానాల్లో పొతే చేస్తే బాగుంటుంది ..? జనసేన కు అక్కడ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి ఇలా అనేక విషయాలపై సమాచారం సేకరించేపనిలో ఇప్పటికే పార్టీలో కొందరు కీలక నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

Pawan Kalyan Wants To Pix A Tour In Telangana-

Pawan Kalyan Wants To Pix A Tour In Telangana

వాస్తవానికి తెలంగాణలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటనేది ఆగస్టు నెలలో ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ మే నెలలో ప్రకటించారు. ఆంధ్రాలో పార్టీ నిర్మాణం పూర్తవగా తెలంగాణపై ప్రకటన చేస్తాననీ, అన్ని స్థానాల్లో పోటీ చేస్తామా, కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తామా అనేది స్పష్టంగా చెబుతానని అన్నారు. జనవరి నెలలో కొండగట్టు హనుమాన్ ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే యాత్ర ప్రారంభించారు. ఇకపై పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటానంటూ కీలక ప్రకటన చేశారు. అదే ఊపులో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. ఆగస్టు తరువాత మళ్లీ వస్తానని అప్పుడే చెప్పారు. దానికి అనుగుణంగానే. త్వరలోనే తెలంగాణ పర్యటన షెడ్యూల్ ను పవన్ కల్యాణ్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడు. అందుకే వీలైనంత తొందరగా అక్కడ కూడా పర్యటన మొదలుపెట్టాలని పవన్ ఆలోచన. ఆంధ్రాతో పాటు తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో పవన్ కి అభిమానులు ఉన్న మాట వాస్తవమే. రాష్ట్రంలో జనసేన యాక్టివ్ అయితే. చేరేందుకు వివిధ రంగాల నుంచి కొందరు సిద్ధంగా ఉన్నవారు అంటున్నారు! త్వరలోనే అన్ని నియోజక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలనీ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.

Pawan Kalyan Wants To Pix A Tour In Telangana-

అయితే తెలంగాణాలో ఎన్నికల బరిలోకి పవన్ ఒంటరిగా వెళ్తాడా లేక ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటాడా అనేది మాత్రం ఇంకా స్పష్టం అవ్వలేదు. కానీ ఏపీలో ఉన్న అన్ని అనుకూల పరిస్థితులు తెలంగాణాలో ఉండకపోవచ్చు. క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం వలన ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటే సరే లేకపోతే ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడం అంటే కత్తిమీద సామే.