పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.కానీ ఆ సినిమాలను మాత్రం పూర్తి చేయడం లేదు.
సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో వరుస హిట్ లు కొట్టిన పవన్ ఆ తర్వాత మాత్రం మరో సినిమాను పూర్తి చేయలేక పోయాడు.ప్రెజెంట్ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ తన నెక్స్ట్ సినిమాలను పూర్తి చేయలేక పోతున్నాడు.
వరుస టూర్స్ తో రాజకీయాలకు మాత్రమే సమయాన్ని అంకితం చేస్తున్నాడు.ఇక ఇప్పుడు రాజకీయాల్లో భాగంగా వైజాగ్ లో సందడి చేస్తున్నాడు.
చాలా రోజుల తర్వాత ఈయన ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.అలా బీచ్ లో నడుచుకుంటూ ఆ నేచర్ ను ఎంజాయ్ చేస్తూ వైట్ అండ్ వైట్ గడ్డం లుక్ తో మంచి స్టైలిష్ గా అనిపిస్తున్నాడు.
ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
పవన్ అలా సరదాగా బీచ్ నడిబొడ్డున సందడి చేస్తున్న పిక్స్ బయటకు రావడంతో ఆయన ఫ్యాన్స్ వాటిని వైరల్ చేసే పనిలో పడ్డారు.ఇక ఈయన ప్రెజెంట్ హరిహర వీరమల్లు సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడో షూట్ స్టార్ట్ చేసాడు.
కానీ ఇప్పటికి కేవలం 60 శాతం పూర్తి కూడా చేసాడు.క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.
కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
మరి ఈ సినిమా ఎప్పటికి పూర్తి అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది అర్ధం కాకుండా మారిపోయింది.ఇక మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మంచి అంచనాలను అయితే పెట్టుకున్నారు.
కానీ క్రిష్ వాటిని నెరవేరుస్తాడో లేదో చూడాలి…
.