సమ్మర్ లో పవర్‌ స్టార్‌ సందడి సాధ్యమేనా? అదే జరిగితే అద్భతమే

పవన్ కళ్యాణ్ హీరో గా ప్రస్తుతం చాలా సినిమాలే రూపొందుతున్నాయి.అయినా ఈ మధ్య కాలం లో ఒక్క సినిమా వచ్చే పరిస్థితి లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Pawan Kalyan Vinodaya Seetham Remake Release For Summer , Mega Hero Sai Dharam T-TeluguStop.com

హరిహర వీరమల్లు సినిమా ను కచ్చితంగా వేసవి కానుకగా విడుదల చేస్తానంటూ దర్శకుడు క్రిష్ రెండు మూడు సందర్భాల్లో పేర్కొన్నాడు.కానీ ఇతర సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న కారణం గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కి కావలసిన డేట్లు ఇవ్వడం లో విఫలమవుతున్నారు.

అందుకే పవన్ కళ్యాణ్ సినిమా ఈ వేసవి కాలం లో ఉండక పోవచ్చని అంతా భావిస్తున్నారు.ఇలాంటి సమయం లో పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అన్నట్లుగా వేసవి కానుకగా ఒక సినిమా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

సముద్ర ఖని దర్శకత్వం లో రూపొందుతున్న వినోదయ సీతమ్‌ రీమేక్ షూటింగ్ శర వేగంగా జరుపుతూ మార్చి నెలలో పూర్తి చేసే ప్లాన్ చేస్తున్నారట.అదే కనక జరిగితే మే నెల కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ సినిమా లో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ కూడా కనిపించబోతున్నాడు.త్రివిక్రమ్ రచన సహకారం అందించడం తో పాటు స్వయంగా ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది.మొత్తానికి పవన్ కళ్యాణ్ సమ్మర్ కానుకగా ఒక సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ వచ్చిన వార్తతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వినోదయ సీతమ్‌ రీమేక్ సమ్మర్ లో విడుదల అవుతుంది అంటే అద్భుతమే అనడంలో సందేహం లేదు.పవన్ కళ్యాణ్ ఆ అద్భుతంతో ప్రేక్షకులను అభిమానులను సర్ప్రైజ్ చేస్తారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube