పవన్ కళ్యాణ్ 'వినోదయ సీతమ్‌' రీమేక్ ఎంత వరకు వచ్చింది భయ్యా?

పవన్‌ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా రూపొందుతున్న వినోదయ సీతమ్‌ రీమేక్ ( vinodaya seetham )షూటింగ్ కార్యక్రమాలు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే.చిత్ర యూనిట్ సభ్యులు చాలా స్పీడ్ గా చిత్రీకరణ జరిపి ఈ వేసవి లోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

 Pawan Kalyan Vinodaya Seetham Movie Remake Shooting Update , Pawan Kalyan  ,vino-TeluguStop.com

అంతే కాకుండా భారీ సెట్స్‌, భారీ టెక్నికల్ వాల్యూస్, తారాగణం లేకుండా సింపుల్ కథ మరియు కథనం తో ఈ సినిమా సాగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.ఇటీవల ఒక సభ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానని చెప్పడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 30 రోజుల నుండి 35 రోజుల మధ్యలో షూటింగ్ లో పాల్గొంటారని యూనిట్ సభ్యులు గతంలోనే పేర్కొన్నారు.ఇప్పటికే 15 రోజుల షూటింగ్ పూర్తయింది.

మరో 15 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేటాయిస్తే మొత్తం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయినట్లు అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్తున్నారు.

మరో వైపు సాయి ధరంతేజ్ ( Sai Dharantej )కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు సినీ ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతాయని సర్ప్రైజ్ చేస్తాయని యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెప్తున్నారు.పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలం లో రీమేక్ లు చేస్తే మంచి విజయాలను అందుకుంటున్నాడు.

అందుకే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.మరో వైపు పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా కూడా సగానికి పైగా పూర్తి అయింది.

ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.రాబోయే ఏడాది కాలం పాటు పవన్ నుండి నాలుగు అయిదు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube