2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రచారంకు వెళ్లిన సమయంలో వచ్చిన జనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పవన్ ను చూసేందుకు భారీగా జనాలు రావడంతో వారంతా కూడా ఓట్లు వేస్తారు.
తప్పకుండా గెలుస్తాను అంటూ పవన్ అనుకున్నాడు.ఆయన వెళ్లిన ప్రతి చోట కూడా అనూహ్య స్పందన దక్కింది.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటించిన సమయంలో భారీ ఎత్తున జనాలు వచ్చారు.కానీ ఎక్కడ కూడా ఓట్ల రూపంలో ఆ జనాలు మారలేదు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నాడు.తెలుగు రాష్ట్రాల్లో వారాహి యాత్ర( Varahi Yatra ) వల్ల కచ్చితంగా జనసేన పార్టీ బలం పెరుగుతుందని ఆ పార్టీ నాయకులు నమ్మకంతో ఉన్నారు.

ముఖ్యంగా ఏపీ లో వచ్చే ఏడాది జరుగబోతున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తామే గెలుస్తామని వారు ధీమాతో ఉన్నారు.వారాహి యాత్రకి వస్తున్న ఆధరణ చూసి కూడా మళ్లీ కచ్చితంగా గెలుస్తామని నమ్మకం పెట్టుకోవద్దు అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ యాత్ర లో కిలో మీటర్ల మేరకు జనాలు ఉంటున్నారు.ప్రతి నియోజక వర్గంలో ఆ స్థాయి లో జనాల నుండి ఓట్లు వస్తే మాత్రం కచ్చితంగా జనసేన పార్టీ కి భారీ ఎత్తున సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీటింగ్స్ కు వచ్చిన స్పందన మరియు వచ్చిన ఓట్ల కు పొంతన లేకుండా ఉంది.అందుకే ఈసారి పరిస్థితి ఏంటి అనేది ఇప్పటి నుండే చెప్పలేం అంటున్నారు.ముందు ముందు జనసేన పార్టీ ఏమైనా బలం పుంజుకుంటే పర్వాలేదు కానీ కచ్చితంగా ముందు ముందు ఈ జనాలపై నమ్మకం పెట్టుకుంటే మాత్రం నిరాశ తప్పదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.వారాహి యాత్ర వల్ల జనసేన కు పెరిగే బలం ఎంత అంటే మాత్రం వెంటనే సమాధానం లేదు.







