ఇండియాలోనే మొదటి సారి‌.. వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ కు కవర్‌ చేశారు

పవన్‌ కళ్యాణ్‌ సోషల్‌ మీడియా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన పేరు ఉంటే చాలు ఆ సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌ అవుతుంది.

 Pawan Kalyan Vakeel Saab Trailer Cover Video-TeluguStop.com

ఆయన వీడియో ఏదైనా యూట్యూబ్‌ లో ట్రెండ్‌ అవుతుంది.వకీల్‌ సాబ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న విషయం తెల్సిందే.

వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ దుమ్ము రేపింది.ఇప్పుడు వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ కు కవర్‌ వచ్చింది.

అంటే ఇంతకు ముందు వరకు పాటలకు మాత్రమే కవర్‌ వీడియోలు ఉండేవి.అంటే పాట ఆడియో అదే వస్తుంది.

కాని డాన్స్‌ చేసే వారు మాత్రం వేరే వాళ్లు.వాటిని కవర్‌ పాటలు అంటారు.

ఇప్పుడు వకీల్‌ సాబ్‌ స్టార్‌ డమ్‌ ను క్యాష్‌ చేసుకునేందుకు గాను ట్రైలర్‌ కు కవర్‌ వీడియోను సంతోషం మ్యాగజైన్‌ అధినేత సురేష్‌ కొండేటి చేయించారు.ఆయన చాలా క్రియేటివిటీతో ఈ వీడియోను చేయించడం జరిగింది.

వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ కు ఏమాత్రం తగ్గకుండా అన్నట్లుగా లాయర్‌ సాబ్‌ ట్రైలర్‌ ఉంది.

షకలక శంకర్‌ ఈ వీడియోలో పవన్‌ గా కనిపించాడు. లాయర్‌ సాబ్‌ ట్రైలర్‌ లో షకలక శంకర్‌ తరహా పంచ్‌ లు ఉండటంతో పాటు పవన్‌ స్టైల్‌ మరియు మ్యానరిజంను కూడా మెయింటెన్‌ చేశారు.మొత్తానికి లాయర్‌ సాబ్‌ అంటూ వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ కు చేసిన కవర్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇలాంటి ఐడియాను చేసినందుకు పవన్‌ అభిమానులు సురేష్‌ కొండేటిని సోషల్‌ మీడియా ద్వారా అభినందిస్తున్నారు.సినిమా విడుదలకు ముందు ఇలాంటి వీడియోలు చేయడం వల్ల సినిమాకు మరింత ప్రమోషన్‌ దక్కతుంది.

అందుకే ఈ చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా సురేష్‌ కొండేటి ప్రయత్నంను అభినందించి ఉంటారు.ఈ ట్రైలర్‌ కవర్‌ కు మంచి ప్రశంసలు దక్కిన నేపథ్యంలో ముందు ముందు మరిన్ని ట్రైలర్‌ కవర్‌ లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

యూట్యూబ్‌ వీడియోకు ఒక కొత్త మార్గం అన్నట్లుగా లాయర్‌ సాబ్‌ వీడియో నిలిచింది.ఇక పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube