హమ్మయ్య.. ఎట్టకేలకు కోర్టుకెళ్తున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ పనులు మెజారిటీ శాతం ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Pawan Kalyan Vakeel Saab To Resume Shooting, Pawan Kalyan, Vakeel Saab, Tollywoo-TeluguStop.com

ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఇప్పటికే అందరిలో మొదలైంది.

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ ఏర్పడింది.

అయితే ఈ సినిమా షూటింగ్‌లో చాలా తక్కువ భాగం మిగిలి ఉండటంతో ఈ షూటింగ్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారా అని అందరూ అనుకుంటున్నారు.కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా ప్రభావంతో ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ ఉంటుందో లేదో అనే నిర్ధారణకు వచ్చేసారు జనం.అయితే అందరికీ షాకిస్తూ ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు తిరిగి మొదలవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసేయానలి భావిస్తున్నాడట.

వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, పవన్ సరసన ఓ స్టార్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube