తూచ్.. వకీల్ సాబ్ కూడా కాదంటున్న పవన్!  

Pawan Kalyan Vakeel Saab Title Changed To Lawyer Saab - Telugu Dil Raju, Lawyer Saab, Pawan Kalyan, Pink Remake, Vakeel Saab, Venu Sriram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రీఎంట్రీ చిత్రాలను లైన్‌లో పెడుతూ బిజీగా ఉన్నారు.రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు.

Pawan Kalyan Vakeel Saab Title Changed To Lawyer Saab

ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తయ్యింది.

ఇక ఈ సినిమా టైటిల్ ఏమిటనే విషయంలో ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ సినిమాకు తొలుత ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పెట్టినట్లు అనుకున్నారు అందరూ.

కానీ చిత్ర నిర్మాత దిల్ రాజు ఫిలిం ఛాంబర్‌లో వకీల్ సాబ్ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడని, అందుకే పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో వస్తుందని అందరూ ఫిక్స్ అయ్యారు.కాగా తాజాగా ఈ టైటిల్‌ను పెట్టేందుకు చిత్ర యూనిట్ ఆసక్తిగా లేరని, సినిమాలో పవన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుండటంతో ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

ఇదే టైటిల్ పవన్‌కు బాగా కలిసొస్తుందని న్యూమరాలజిస్టులు సూచించడంతో చిత్ర యూనిట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు

Pawan Kalyan Vakeel Saab Title Changed To Lawyer Saab-lawyer Saab,pawan Kalyan,pink Remake,vakeel Saab,venu Sriram Related....