టీజర్ టాక్: వకీల్ సాబ్ కోటు తీశాడంటే అంతే!  

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్ర టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం కోసమే కాదు, ఈ చిత్ర టీజర్ కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TeluguStop.com - Pawan Kalyan Vakeel Saab Teaser Talk

ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎందుకు అంత భారీ అంచనాలు నెలకొన్నాయో ఈ టీజర్ చూస్తే ఇట్టే తెలుస్తోంది.లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ తన ప్రేక్షకులు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

ఇక ఈ టీజర్ ఆద్యాంతం పవర్ స్టార్‌ను ఎలివేట్ చేసిన విధానం అభిమానులకు నిజమైన సంక్రాంతి పండుగ కానుక అని చెప్పాలి.ఈ టీజర్‌లో పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో పాటు ఆయన్ను ప్రెజెంట్ చేసిన విధానం సూపర్బ్.

TeluguStop.com - టీజర్ టాక్: వకీల్ సాబ్ కోటు తీశాడంటే అంతే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక టీజర్‌లో పవన్ చెప్పిన డైలాగు పీక్స్ అని చెప్పాలి.‘కోర్టులో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అనే డైలాగును పవన్ చాలా పవర్‌ఫుల్‌గా చెప్పడంతో ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.

ఇక ఈ టీజర్ మొత్తంలో పవన్ మెయిన్ హైలైట్ కాగా మరో హైలైట్‌గా థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నిలిచింది.

చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్న బీజీఎం ఈ టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

బీజీఎం అందించడంలో థమన్ ఎందుకంత స్పెషల్ అనేది ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది.పవన్ లుక్స్, అదిరిపోయే డైలాగ్‌తో పాటు బీజీఎం కలగలిసి ఈ టీజర్‌ను సూపర్‌గా మలిచాయి.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.పవన్ భార్య పాత్రలో శృతి హాసన్ కేమియో రోల్ చేస్తున్న సంగతి తెలిసందే.

మరి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వకీల్ సాబ్ టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

#Teaser #PSPK26 #Vakeel Saab #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు