ఫ్యాన్స్‌ను పండగ చేసుకోమంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే చివరి దశ షూటింగ్‌ను జరుపుకుంటోంది.ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తోండగా, వకీల్ సాబ్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

 Pawan Kalyan Vakeel Saab Sure For Sankranthi Release, Pawan Kalyan, Vakeel Saab,-TeluguStop.com

ఇక ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు జరిగితే ఈపాటికి సినిమా పూర్తయ్యి రిలీజ్ కూడా అయ్యేది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉండగా వాయిదా పడింది.

అయితే ఈసారి ఎలాగైనా అనుకున్న సమయానికి సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని పవన్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

డిసెంబర్ నాటికి ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి పండగ సమయానకి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.బాలీవుడ్ చిత్రం ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాతో పవన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో పవన్‌తో పాటు నివేదా థామస్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా సంక్రాంతి బరిలో ఇప్పటికే సీటు కన్ఫం చేసుకున్న అరణ్య, క్రాక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలు పోటీ పడుతుండటంతో, వకీల్ సాబ్ ల్యాండ్ అయితే ఈ పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి బాక్సాఫీస్ వద్ద వకీల్ సాబ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది తెలియాలంటే మాత్రం పండగ వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube