వకీల్ సాబ్ కూడా అమ్ముడుపోయాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే చివరి దశ షూటింగ్‌ను జరుపుకోవాల్సి ఉందనే విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రెండేళ్ల తరువాత వెండితెరపై కనిపిస్తుండటంతో తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

 Vakeel Saab Satellite Rights Sold For Bomb, Pawan Kalyan, Vakeel Saab, Satellite-TeluguStop.com

బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రంతో పవన్ మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.కాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే కొన్ని అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది.ఈ క్రమంలో వకీల్ సాబ్ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను ఏకంగా రూ.16.5 కోట్ల భారీ మొత్తానికి జెమినీ టీవి ఛానల్ సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.పవన్ నటిస్తున్న చిత్రం శాటిలైట్ రైట్స్ ఇంత భారీ రేటుకు అమ్ముడు కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ క్రియేట్ చేస్తుందా అని అందరూ చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో పవన్ ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడు.లాయర్ పాత్రలో పవన్ యాక్టింగ్ పీక్స్‌లో ఉంటుందని, ప్రేక్షకులు పవన్ పాత్రను పూర్తిగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో అందాల భామ నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, శృతి హాసన్ ఓ కేమియో పాత్రలో కనిపించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube