పవన్‌ స్పీచ్‌ కూడా రికార్డ్‌.. వకీల్‌ సాబ్‌ ముందు ముందు మరెన్ని రికార్డులో!

పవన్‌ కళ్యాణ్‌ అడుగు తీసి అడుగు పెడితే రికార్డు అన్నట్లుగా ఉంది.ముఖ్యంగా వకీల్‌ సాబ్‌ సినిమా విషయంలో అన్ని విధాలుగా రికార్డుల మోత మ్రోగుతూనే ఉంది.

 Pawan Kalyan Vakeel Saab Pre Release Speech Trending In Twitter , Bandla Ganesh-TeluguStop.com

సోషల్‌ మీడియా యూట్యూబ్‌ లో పవన్‌ రికార్డులను ఇప్పట్లో ఏ స్టార్‌ హీరో కూడా బ్రేక్‌ చేయలేరేమో అన్నట్లుగా ఉంటున్నాయి.వకీల్‌ సాబ్‌ సినిమా ట్రైలర్‌ కు వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అతి తక్కువ సమయంలో రికార్డు బ్రేకింగ్‌ లైక్స్‌ వచ్చాయి.ఇతర సినిమాలకు వారాల తరబడి పట్టిన రికార్డులకు పవన్‌ కు కేవలం 24 గంటల సమయం మాత్రమే పట్టింది అంటే ఏ రేంజ్‌ లో పన్‌ వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ ను ఆయన అభిమానులు ట్రెండ్‌ చేశారో అర్థం చేసుకోవచ్చు.

అద్బుతమైన రికార్డులను వకీల్‌ సాబ్‌ అందుకుంటూనే ఉంది.ఈ వారంలో విడుదల కాబోతున్న వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది.

మరోసారి పవన్‌ ఈ సందర్బంగా రికార్డును దక్కించుకున్నాడు.

యూట్యూబ్‌ లో దిల్‌ రాజు అధికారిక ఛానెల్‌ లో వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ వేడుక లైవ్‌ ను ఏకంగా 1.4 లక్షల మంది చూశారు.ఇప్పటి వరకు ఏ సినిమా ప్రీ రిలీజ్ వేడుక లైవ్‌ ను లైవ్‌ లో చూసింది లేదు.

ఇంత భారీగా వ్యూస్‌ ను దక్కించుకున్న దిల్‌ రాజు టీమ్‌ మరో అరుదైన రికార్డును దక్కించుకుంది.పవన్‌ కళ్యాణ్‌ ఈ వేడుకలో మాట్లాడిన 30 నిమిషాలకు పైగా ఉన్న వీడియోను యూట్యూబ్‌ లో షేర్‌ చేయడం జరిగింది.

ఆ వీడియోకు కేవలం 12 గంటల్లోనే మిలియన్‌ వ్యూస్ వచ్చాయి.ప్రీ రిలీజ్‌ వేడుక స్పీచ్‌ విషయంలో ఇదో రికార్డుగా చెబుతున్నారు.అద్బుతమైన రికార్డులను సొంతం చేసుకుంటున్న వకీల్‌ సాబ్‌ సినిమా విడుదల తర్వాత మరెన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.యూట్యూబ్‌ లో పవన్‌ అభిమానులను మించిన వారు లేరు అని మళ్లీ నిరూపితం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube