వకీల్‌ సాబ్ ప్రీ రిలీజ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ విడుదలకు సిద్దం అవుతుంది.వచ్చే నెల 9వ తారీకున రాబోతున్న వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టారు.

 Pawan Kalyan Vakeel Saab Pre Release Function In Yusuf Guda-TeluguStop.com

బాలీవుడ్‌ సూపర్‌ హిట్ మూవీ పింక్ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్మాత దిల్‌ రాజు భారీ ఎత్తున చేయడం జరుగుతుంది.

వచ్చే నెల 3వ తారీకున ప్రీ రిలీజ్‌ వేడుకను ప్రముఖుల సమక్షంలో నిర్వహించబోతున్నారట.పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే ఉద్దేశ్యంతో యూసుఫ్‌ గూడ పోలీస్‌ లైన్స్‌ గ్రౌండ్స్‌ లో ఈ వేడుకను నిర్వహించాలని దిల్‌ రాజు ఇప్పటికే అనుమతులు కూడా తీసుకున్నాడని అంటున్నారు.

స్టార్‌ మరియు సూపర్‌ స్టార్‌ లను ఈ వేడుక కోసం ఆహ్వానించడం జరుగుతుంది.

మెగా ఫ్యామిలీ నుండి ఒక పెద్ద స్టార్‌ వస్తాడని అంటున్నారు.

ఆ పెద్ద స్టార్‌ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత ఏడాది విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అయిన విషయం తెల్సిందే.

ఇప్పుడు సినిమా ను ఒక మంచి డేట్ చూసి దిల్‌ రాజు విడుదల చేస్తున్నాడు.దాదాపుగా 150 కోట్ల రూపాయల బిజినెస్ ను చేసిన ఈ సినిమా ఏ రేంజ్ లో వసూళ్లు చేస్తుందో చూడాలి.

పింక్ అనేది లేడీ ఓరియంటెడ్‌ సినిమా మహిళల సమస్య లపై కోర్టులో చర్చించే సినిమా దాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చారు.కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా ను తెరకెక్కించారని అంటున్నారు.

శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube