పవన్‌ వకీల్ సాబ్‌ రేటింగ్ ఎంతో తెలుసా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్‌ సాబ్ సినిమా థియేటర్లలో కరోనా కారణంగా ఎక్కువ రోజులు ఆడలేదు.రెండు వారాల పాటు సినిమా నడిచినా ఆ తర్వాత సెకండ్‌ వేవ్ కారణంగా నిలిచి పోయింది.

 Pawan Kalyan Vakeel Saab Movie Zee Telugu Rating-TeluguStop.com

వెంటనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అమెజాన్‌ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌ అయిన వకీల్‌ సాబ్‌ సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

థియేటర్లలో మరియు ఓటీటీ లో రిలీజ్ అయ్యింది కనుక ఈ సినిమా ను బుల్లి తెరపై ఎవరు చూస్తారులే అని చాలా మంది అనుకున్నారు.ఈ సినిమా ను ఇటీవలే జీ తెలుగు లో టెలికాస్ట్‌ చేసిన విషయం తెల్సిందే.

 Pawan Kalyan Vakeel Saab Movie Zee Telugu Rating-పవన్‌ వకీల్ సాబ్‌ రేటింగ్ ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వకీల్‌ సాబ్‌ సినిమా ను జీ తెలుగు వారు భారీ ఎత్తున ప్రమోట్‌ చేశారు.దాంతో సినిమా కు ఏకంగా 19.12 రేటింగ్ ను దక్కించుకుంది.వకీల్‌ సాబ్‌ సినిమా అన్ని ప్లాట్ ఫామ్స్ పై సక్సెస్‌ ను దక్కించుకున్న నేపథ్యంలో పవన్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Telugu Film News, Movie News, Pawan Kalyan, Pawan News, Vakeel Saab, Vakeel Saab Zee Telugu-Movie

బాలీవుడ్ సూపర్‌ హిట్‌ మూవీ పింక్ కు రీమేక్ గా రూపొందిన వకీల్‌ సాబ్‌ సినిమా లో కాస్త కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి హీరోయిన్ పాత్రను జోడించి దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు.బోణీ కపూర్ తో కలిసి దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించాడు.పెద్ద బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు లాభాలను తెచ్చి పెట్టింది.సినిమాకు వచ్చిన వసూళ్ల నేపథ్యంలో రికార్డు ఖాయం అంటూ అంతా అనుకున్నారు.

కాని సినిమా ను రెండు వారాల్లోనే కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల థియేటర్ల నుండి తొలగించారు.ఆ తర్వాత అమెజాన్ వారు స్ట్రీమింగ్‌ చేయగా సక్సెస్‌ దక్కించుకుంది.

అమెజాన్‌ వారికి మంచి లాభం దక్కిందని చెప్పుకోవచ్చు.ఇక వకీల్ సాబ్‌ సినిమా తాజాగా జీ తెలుగు లో కూడా మంచి రేటింగ్‌ ను దక్కించుకుంది.

#Vakeel Saab #Pawan Kalyan #Pawan #Vakeel Saab Zee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు