ఇది కేవలం పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు మాత్రమే సాధ్యం అవుతుంది

పవన్ కళ్యాన్‌ అభిమానులు ఏంటో మరోసారి నిరూపితం అయ్యింది.వారు తల్చుకుంటే సోషల్‌ మీడియా రికార్డుల వర్షం కురిపించడం ఖాయం అని వకీల్ సాబ్ ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.వకీల్‌ సాబ్‌ సినిమా రికార్డు స్థాయి లైక్స్ ను దక్కించుకుంటుంది.24 గంటల లోపు 1 మిలియన్ లైక్స్ అంటే మామూలు విషయం కాదు.ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కు సాధ్యం కాలేదు.ఇది బాలీవుడ్‌ లో కూడా అంత ఈజీ కాదు.తెలుగు లో ఈ సినిమా సాధించబోతున్న రికార్డులకు ఇది ఆరంభం మాత్రమే అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు నమ్మకం చెబుతున్నారు.మూడు సంవత్సరాల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ సినిమా ను చేశాడు.

 Pawan Kalyan Vakeel Saab Movie Trailer Records , Pawan Kalyan, Pawan Movie, Vake-TeluguStop.com

ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యాడు.రాజకీయాల్లోకి స్టార్‌ గా ఏమీ ఎదగలేదు.

అయినా కూడా ఆయనకు అద్బుతమైన ఫాలోయింగ్ ఉంది.రాజకీయాల్లో ఆయన్ను చూడాలనుకోవడం లేదు కాని సినిమా ల్లో ఆయను స్టార్‌ గా చూడాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

ఈ సమయంలో కూడా పవన్‌ కళ్యాణ్‌ ను ఇంతగా అభిమానిస్తారని ఎవరు అనుకోలేదు.

వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ వ్యూస్ మరియు లైక్స్ సినిమా ను ముందే హిట్‌ అనుకునేలా చేశాయి.

సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా వంద కోట్లు ఖాయం అన్నట్లుగా మాత్రం పరిస్థితి ఉంది.అంతటి స్టామినాను ట్రైలర్‌ తోనే రాబట్టారు.పవన్‌ అభిమానులకు మాత్రమే ఇది సాధ్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ ప్రేమికులు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వకీల్‌ సాబ్‌ ట్రైలర్ తో దుమ్ము రేపిన పవన్ అభిమానులు వసూళ్ల విషయంలో కూడా తమ అభిమాన హీరోను ఆకాశంలో నిలిపేందుకు ప్రయత్నించడం ఖాయం.

ఏదైనా పవన్‌ కళ్యాణ్ అభిమానులు చేయగలరు అనేందుకు గతంలోనే సాక్ష్యాలు దక్కాయి.ప్రతి సినిమా మినిమంగా వసూళ్లు చేస్తూ అద్బుతంగా నిలవడమే పవన్ కళ్యాణ్ అభిమానుల స్టామినా ఏంటో చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube