వీడియోః వచ్చేసిన వకీల్‌ సాబ్‌ సత్యమేవ జయతే

పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్ నుండి సత్యమేవ జయతే పాట రాబోతుందని ప్రకటించినప్పటి నుండి అభిమానులు మరియు అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Pawan Kalyan Vakeel Saab Movie Second Song Satyameva Jayathe Release-TeluguStop.com

సత్యమేవ జయతే అంటూ సాగే పాట పవన్ కళ్యాణ్‌ ఆలోచనకు తగ్గట్లుగా ఉంటుందని మొదటి నుండి అనుకుంటూ వస్తున్న అభిమానులకు పాట విడుదల తర్వాత క్లారిటీ వచ్చేసింది.పవన్‌ సినిమా లో ఎలా కనిపిస్తాడో పాటలో చెప్పేశారు.

అద్బుతమైన లిరిక్స్ తో సాగిన ఈ పాటకు ప్రాణం పోసేలా థమన్ సంగీతాన్ని అందించాడు.ఈ పాటను శంకర్‌ మహదేవన్‌ పాడిన నేపథ్యంలో సినిమా కు మరింతగా క్రేజ్ దక్కింది.

 Pawan Kalyan Vakeel Saab Movie Second Song Satyameva Jayathe Release-వీడియోః వచ్చేసిన వకీల్‌ సాబ్‌ సత్యమేవ జయతే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పాట లో పవన్ ను చూస్తున్న అభిమానులు పూనకాలు వచ్చేలా ఊగిపోతున్నారు.

పవన్‌ నుండి ఏం ఆశిస్తున్నామో అదే ఈ సినిమా లో ఉంటుందని మరో సారి నిరూపితం అయ్యింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు నమ్మకంగా చెబుతున్నారు.

పాట లిరిక్స్ ఎంత చక్కగా ఉన్నాయంటే పవన్‌ యొక్క గొప్పతనంను ఎప్పటికప్పుడు అభిమానులు తెలుసుకునే విధంగా ఉన్నాయంటూ పాటకు అభిమానుల కామెంట్స్ వస్తున్నాయి.ఇలాంటి పాటను రాసినందుకు రామ జోగయ్య శాస్త్రి కి మరియు సంగీత దర్శకుడు థమన్‌ కు అభిమానులు కృతజ్ఞతలు చెబుతున్నారు.

ప్రతి ఒక్క పదం కూడా అద్బుతంగా ఉంది.పవన్‌ మార్క్‌ మెసేజ్ మరియు ఆయనకు సరిగ్గా సూట్ అయ్యేలా ఈ పాట ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.మొత్తానికి వకీల్‌ సాబ్‌ పై ఉన్న అంచనాలను మరింతగా పెంచేలా ఈ పాట ఉందని అంటున్నారు.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి మరియు నివేథా థామస్‌ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు మరియు బోణీ కపూర్‌ లు నిర్మిస్తున్నారు.

#VakeelSaab #Pawan Kalyan #BreakingNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు