వకీల్‌ సాబ్‌కు రూ.2 కోట్లు.. ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే ఇది టాప్‌

సినిమాను ఎంతగా ఖర్చు పెట్టి తీసినా కూడా ఆ సినిమాను ప్రమోట్ చేసేందుకు మాత్రం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన రోజులు ఇవి.పాతిక లక్షలు పెట్టి సినిమా తీస్తే పది లక్షలు పెట్టి ఖర్చు పెడితే కాని సినిమాకు పబ్లిసిటీ వచ్చే అవకాశం లేదు.

 Pawan Kalyan Vakeel Saab Movie Pre Release Event Budget , Dil Raju, Pawan Kalyan-TeluguStop.com

అందుకే పెద్ద సినిమాలకు స్టార్‌ హీరోల సినిమాలకు కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ ఈవెంట్ లను నిర్వహిస్తూ ఉంటారు.వకీల్‌ సాబ్‌ కు కోటి రూపాయలు పెట్టి ప్రమోషనల్‌ ఈవెంట్‌ ను పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ తరహాలో ప్లాన్‌ చేస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి.

కాని వకీల్‌ సాబ్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వేడుక కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.ప్రస్తుతం ఈ వీడియో అందరు అవాక్కయ్యేలా చేస్తోంది.

వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది.సరైన సమయం కోసం వెయిట్‌ చేసిన దిల్‌ రాజు ఒక మంచి సమయంలోనే విడుదల చేస్తున్నారు.

తప్పకుండా ఈ సినిమా మరో రేంజ్‌ లో ఉంటుంది.సినిమాను ప్రమోట్ చేయడం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.

ఈవెంట్‌ మేనేజర్‌ చెబుతున్న దాని ప్రకారం రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ వేడుక నిర్వహించబోతున్నారు.ఇప్పటి వరకు తెలుగ సినిమా చరిత్రలోనే కాకుండా ఏ ఇతర సినిమాలకు కూడా ఖర్చు చేయనంతగా ఈ వేడుక కోసం ఖర్చు చేస్తున్నామని ఆయన అంటున్నాడు.

ఒక ఈవెంట్‌ కు మరీ ఇంత ఖర్చు అవుతుందా అంటే ఏమో డౌటే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరీ ఇంత ఖర్చు పెట్టడం ఏంటీ గురూ అతిశయోక్తి కాకుంటే.

అసలు విషయం ఏంటీ అనేది మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube