ఆహాలో స్ట్రీమింగ్ కు 'వకీల్‌ సాబ్‌'.. దిల్‌ రాజు ప్లాన్‌ అదుర్స్‌

వకీల్ సాబ్‌ ఇటీవలే అమెజాన్‌ లో స్ట్రీమింగ్ అవుతుంది కదా మళ్లీ ఆహా లో ఏంటీ అంటూ ఆలోచిస్తున్నారా.అసలు విషయం ఏంటీ అంటే ఇండియాలో మరియు ఓవర్సీస్‌ లో సినిమా రైట్స్ ను వేరు వేరుగా అమ్మేస్తూ ఉంటారు.

 Pawan Kalyan Vakeel Saab Movie Now Streaming In Aha Telugu Ott-TeluguStop.com

అంటే వకీల్‌ సాబ్‌ సినిమా ఇండియాలో మాత్రమే రైట్స్ అమ్మాయి.ఓవర్సీస్ అభిమానులు అమెజాన్ లో వకీల్‌ సాబ్‌ సినిమా ను చూసే అవకాశం లేదు.

ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ ను మొదలు పెట్టారు.అది కూడా ఆహా లో భారీ ఎత్తున స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Pawan Kalyan Vakeel Saab Movie Now Streaming In Aha Telugu Ott-ఆహాలో స్ట్రీమింగ్ కు వకీల్‌ సాబ్‌’.. దిల్‌ రాజు ప్లాన్‌ అదుర్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతున్న వకీల్‌ సాబ్‌ సినిమా ను చూడాలంటే ఓవర్సీస్ వారు భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

పవన్‌ కళ్యాణ్‌.

శృతి హాసన్‌ జంటగా దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమా కు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించాడు.తెలుగు రాష్ట్రాలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వకీల్‌ సాబ్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల ఆగిపోయింది.

కాని వకీల్‌ సాబ్‌ వెంటనే అమెజాన్ ప్రైమ్‌ లో విడుదల చేయడం జరిగింది.భారీ ఎత్తున వ్యూస్ ను దక్కించుకున్న వకీల్‌ సాబ్‌ లో దాదాపు వారం రోజుల పాటు ట్రెండ్‌ అయ్యింది.

వకీల్‌ సాబ్‌ కు పోటీగా ఇతర సినిమా లు ఏమీ లేకపోవడం వల్ల అమెజాన్ లో భారీ వ్యూస్ ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ఆహా లో వకీల్‌ సాబ్‌ ను విడుదల చేసిన వెంటనే ఓవర్సీస్‌ ప్రేక్షకులు కూడా వెంటనే సినిమా ను చూసేందుకు ఆసక్తిగా చూపిస్తున్నారు.

  దిల్ రాజు వకీల్‌ సాబ్‌ ఓవర్సీస్‌ స్ట్రీమింగ్‌ రైట్స్ ను ఆహా కు ప్రత్యేకంగా అమ్మడం వల్ల భారీ మొత్తం లో డబ్బులు దక్కించుకునే అవకాశం దక్కింది.రెండు ఓటీటీ లకు వకీల్‌ సాబ్‌ ఇచ్చి దిల్‌ రాజు భారీ లాభాలను పొందాడు అంటున్నారు.

#DirectorVenu #Pawan Kalyan #VakeelSaab #Aha OTT #Vakeel Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు