సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీ లో వకీల్ సాబ్ భారీ ఎత్తున విడుదలకు సిద్దం అయ్యింది.మొదటి రోజు ఏఎంబీలో ఈ సినిమా ఏకంగా 7 స్క్రీన్స్ లో కలిపి 27 షోలు పడబోతుంది.
ఈ 27 షోలకు కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ పూర్తి అయ్యింది.ఇక వీకెండ్స్ మరియు ఉగాది సందర్బంగా కూడా భారీ ఎత్తున ఏఎంబీ లో సినిమాను చూసేందుకు జనాలు అడ్వాన్స్ బుకింగ్ ను చేసుకున్నారు.
ఈ మొత్తం అడ్వాన్స్ బుకింగ్ ఏఎంబీ రికార్డుగా నమోదు అయ్యింది.ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇన్ని షోలు మొదటి ఆట పడింది లేదు.
ఇక అయిదు రోజుల పాటు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఏకాబికీన జరగడం రికార్డుగా చెబుతున్నారు.ఇప్పటి వరకు ఏఎంబీలో ఏ సినిమా కూడా కోటికి పైగా వసూళ్లు నమోదు చేయలేదు.
కాని వకీల్ సాబ్ సినిమా మాత్రం మహేష్ బాబు మల్టీప్లెక్స్ లో కోటి తో బోణీ కొట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఏఎంబీ సినిమా ప్రారంభం అయ్యి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది.
ఈ మూడేళ్లలో ఎన్నో భారీ చిత్రాలు అందులో రిలీజ్ అయ్యాయి.కాని ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని వసూళ్లను ఈ సినిమా సాధించడం ఖాయం అంటూ ఏఎంబీ వర్గాల వారు చెబుతున్నారు.
ప్రస్తుతం వకీల్ సాబ్ పై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ అయ్యింది.ఇక సినిమా సక్సెస్ అయితే పరిస్థితి పూర్తిగా మారిపోతుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా సక్సెస్ అయితే ఎక్కువ షో లు మరిన్ని రోజులు వేస్తామని ఏఎంబీ యాజమాన్యం చెబుతున్నారు.ఇక వకీల్ సాబ్ కు పోటీ అన్నట్లుగా మరే సినిమా లేదు.
కనుక ఖచ్చితంగా ఏఎంబీ లో వకీల్ సాబ్ అరుదైన రికార్డును కొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.కేవలం ఏఎంబీలో మాత్రమే కాదు మొత్తం అన్ని మల్టీ ప్లెక్స్ ల్లో కూడా ఇదే పరిస్థితి ఉందంటున్నారు.