వామ్మో.. వకీల్ సాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కోట్లా..?

2021 సంవత్సరంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కి విడుదలైన తొలి సినిమాగా వకీల్ సాబ్ నిలిచింది.కరోనా భయం ఉన్నా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

 Pawan Kalyan Vakeel Saab Movie First Day Collections Details-TeluguStop.com

వకీల్ సాబ్ ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు తొలిరోజే 42 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను 36 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.

నైజాంలో వకీల్ సాబ్ దాదాపు 9 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించగా సీడెడ్ లో 4.5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ కలెక్షన్లు 32 కోట్ల రూపాయల 24 లక్షలుగా ఉన్నాయి.ఓవర్సీస్ లో ఈ సినిమా దాదాపు 2.50 కోట్ల రూపాయలు సాధించగా ఇతర ఏరియాల కలెక్షన్లు కోటీ 80 లక్షలు కావడం గమనార్హం.పలు ఏరియాల్లో వకీల్ సాబ్ బాహుబలి సినిమా రికార్డులను అధిగమించింది.

 Pawan Kalyan Vakeel Saab Movie First Day Collections Details-వామ్మో.. వకీల్ సాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కోట్లా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏపీలో స్పెషల్ షోలు, టికెట్ల పెంపుకు అనుమతులు ఇచ్చి ఉంటే ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉండేవని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

పవన్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ తో కలెక్షన్లపరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం. 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజైన వకీల్ సాబ్ సులభంగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి.

Telugu 36 Crores Collections, First Day Collections, Pawan Kalyan, Vakeel Saab-Movie

మరోవైపు ఈ సినిమాలో శృతిహాసన్ ఉన్న సీన్లను తొలగించాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.ఆ సీన్ల వల్ల సినిమాకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు.అంజలి, నివేదా పాత్రలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

#36Crores #Vakeel Saab #Pawan Kalyan #FirstDay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు