పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల అయిన విషయం తెల్సిందే.యూఎస్ లో దాదాపుగా 600 స్క్రీన్స్ కు పైగా విడుదల అయిన ఈ సినిమా కు భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశించారు.
కాని మిలియన్ డాలర్లకు కూడా సినిమా చేరుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది.సినిమా యూఎస్ లో ఏమాత్రం ప్రభావం చూపించలేక పోతుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటి వరకు అక్కడ వకీల్ సాబ్ సినిమా 7 లక్షల డాలర్లు మాత్రమే రాబట్టాడు.లాంగ్ రన్ లో మిలియన్ డాలర్లను చేరుకుంటుందా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 30 శాతం వసూళ్లు రాబట్టాల్సి ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.మరి అది సాద్యమేనా అంటే ఇక సాధ్యం కాకపోవచ్చు అంటూ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాతి రత్నాలు సినిమా అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది.అలాంటిది వకీల్ సాబ్ మాత్రం వసూళ్ల విషయంలో యూఎస్ లో వెనుకబడి ఉన్నాడు అంటున్నారు.
వసూళ్లు ఎలా ఉన్నా కూడా వకీల్ సాబ్ కు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. పవన్ తదుపరి సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తే దుమ్ము లేచి పోవడం కాయం అంటున్నారు.
పింక్ రీమేక్ అవ్వడం వల్ల వకీల్ సాబ్ కంటే ముందే యూఎస్ లో ఉన్న వారు పింక్ చూసి ఉంటారు.కనుక వకీల్ సాబ్ ను ప్రత్యేకంగా చూసేందుకు వారు ఆసక్తి చూపక పోవచ్చు అంటున్నారు.
కారణం ఏదైనా వకీల్ సాబ్ యూఎస్ లో మిలియన్ మార్క్ అందుకోక పోవడం చాలా పెద్ద లోటు గా చెబుతున్నారు.