వకీల్‌ సాబ్ డేట్‌ అండ్ టైమ్‌ ప్రకటించిన జీ వారు

పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ బుల్లి తెర వరల్డ్‌ ప్రీమియర్ కు సిద్దం అయ్యింది.కరోనా సెకండ్‌ వేవ్‌ కు కాస్త ముందు వచ్చిన వకీల్‌ సాబ్‌ కు కలెక్షన్స్‌ విషయంలో కరోనా వల్ల నిరాశ తప్పలేదు.

 Pawan Kalyan Vakeel Saab In Zee Telugu Telecast Date Details, Movie News, News A-TeluguStop.com

అమెజాన్ లో ఈ సినిమాను భారీ ఎత్తున అభిమానులు చేశారు.సినిమా వసూళ్ల విషయం లో అమెజాన్‌ వ్యూస్ విషయం లో రికార్డు లు నమోదు అయ్యాయి.

ఇక వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌ కు జీ తెలుగు సినిమా అయ్యింది.ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జీ తెలుగు వారు భారీ మొత్తం ను ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

జీ తెలుగు వారు మంచి సమయం చూసి ఈ సినిమా ను టెలికాస్ట్‌ చేయాలని భావిస్తున్నారు.అందుకోసం సరైన సమయం కుదిరినట్లుగా వారు ప్రకటించారు.

అర్థరాత్రి సమయంలో వారు వకీల్‌ సాబ్‌ సినిమా టెలికాస్ట్‌ సమయం ను వచ్చే ఆదివారం అంటూ ప్రకటించారు.ఈనెల 18 వ తారీకున ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో టెలికాస్ట్‌ కాబోతుంది అంటూ వారు ప్రకటించారు.

ఈ వారం రోజుల పాటు జీ తెలుగు మరియు జీ సినిమా ఛానెల్స్ లో వకీల్‌ సాబ్ టెలికాస్ట్‌ కు సంబంధించిన ప్రమోలతో దుమ్ము రేపే అవకాశం ఉంది.

Telugu Pm, Pawan Kalyan, Sunday, Vakeel Saab, Vakeelsaab, Vakkelsaab, Zee Telugu

పవన్‌ కు ఉన్న స్టార్‌ డమ్‌ తో పాటు వకీల్‌ సాబ్‌ కు వచ్చిన పాజిటివ్‌ రెస్పాన్స్‌ కారణంగా పెద్ద ఎత్తున ఈ సినిమాకు రేటింగ్‌ వస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.వకీల్‌ సాబ్‌ సినిమా నుండి వచ్చిన రేటింగ్‌ తో అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయం అంటున్నారు.బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ పింక్ కు ఇది రీమేక్‌ అనే విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube