'వకీల్‌ సాబ్‌' జీ తెలుగు రేటింగ్ పరిస్థితి ఏంటీ?

పవన్ కళ్యాణ్‌ దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వకీల్‌ సాబ్‌ తో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండే పవన్‌ అభిమానులతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది.

 Pawan Kalyan Vakeel Saab In Zee Telugu Telecast And Rating-TeluguStop.com

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘పింక్‌‘ కు రీమేక్ గా రూపొందిన వకీల్‌ సాబ్‌ ఈ ఏడాది ఆరంభంలో విడుదల అయ్యింది.అయితే కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవ్వడం.

విడుదల తర్వాత కూడ కరోనా వెంటాడటంతో వసూళ్ల పై ప్రభావం పడింది.వసూళ్లు తగ్గడంతో వెంటనే అమెజాన్ లో విడుదల అయిన ఈ సినిమాను జనాలు భారీ గా చూశారు.

 Pawan Kalyan Vakeel Saab In Zee Telugu Telecast And Rating-వకీల్‌ సాబ్‌’ జీ తెలుగు రేటింగ్ పరిస్థితి ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమ ను మొన్న ఆది వారం సాయంత్రం సమయంలో జీ తెలుగు లో టెలికాస్ట్‌ చేశారు.సినిమా పై అంచనాలు భారీగా ఉన్న కారణంగా జీ తెలుగు వారు ఓ రేంజ్ లో ప్రమోషన్‌ చేసి టెలికాస్ట్‌ చేశారు.

Telugu Film News, Pawan Kalyan, Vakeel Saab, Zee Telugu-Movie

జీ తెలుగు లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా పెద్ద ఎత్తున రేటింగ్‌ దక్కించుకుంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.రేటింగ్‌ విషయంలో జీ తెలుగు నుండి ఇప్పటి వరకు ఎలాంటి స మాచారం లేదు.కాని బుల్లి తెర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం భారీ ఎత్తున రేటింగ్‌ వచ్చినట్లుగా చెబుతున్నారు.ఇప్పటికే జీ తెలుగు లో ఉన్న రికార్డులు అన్ని కూడా బ్రేక్ అయ్యాయి అంటున్నారు.

ఈమద్య కాలంలో స్ట్రీమింగ్ అయిన సినిమాలన్నింటి కంటే వకీల్‌ సాబ్‌ కే ఎక్కువ రేటింగ్‌ వచ్చిందట.ఈ ఏడాది లో వకీల్ సాబ్ రేటింగ్‌ రికార్డుగా ఇప్పటి వరకు నమోదు అయ్యిందని చెబుతున్నారు.

అధికారిక రేటింగ్‌ మూడు రోజుల్లో రాబోతుంది.

#Pawan Kalyan #Vakeel Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు