పవన్ ఈసారి అది చేయలేదంటోన్న ఆలీ  

Pawan Kalyan Vakeel Saab Ali - Telugu Ali, Mangoes, Pawan Kalyan, Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎలాంటి అభిమానాన్ని దక్కించుకున్నాడో, మంచి స్నేహితుడిగా పలువురి దగ్గర అంతకు మించిన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ముఖ్యంగా పవన్‌తో ఎల్లప్పుడూ ఉండే త్రివిక్రమ్, పవన్‌తో గతకొన్నేళ్లుగా పయనిస్తున్న ఆలీతో పవన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు.

 Pawan Kalyan Vakeel Saab Ali

పవన్ గురించి వారు పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి.పవన్ తమకు సంబంధించిన విషయాలన్నింటినీ గుర్తుకు పెట్టుకుంటాడని వారు పలుమార్లు తెలిపారు.

కాగా కమెడియన్ ఆలీతో పవన్‌కు మంచి స్నేహం ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.అయితే ఇటీవల ఆలీ వైసీపీ పార్టీలో చేరడంతో వారిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి.

పవన్ ఈసారి అది చేయలేదంటోన్న ఆలీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే పవన్ ప్రతి యేటా తన తోటలోని మామిడిపండ్లను తన స్నేహితులకు పంపేవాడని, ఈసారి తమ మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈయేడు తనకు పవన్ మామిడి పండ్లు పంపలేదని చాలా బాధతో ఆలీ చెప్పుకొచ్చాడు.అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటమే దీనికి కారణం అని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.

మొత్తానికి పవన్, ఆలీల స్నేహం మునుపటిలా కాకుండా వారి మధ్య మనస్పర్థలు రావడంతో వారు కాస్త దూరం అయ్యారని స్పష్టం అవుతుంది.మరి పవన్ ఈసారి కూడా అందరికీ తన తోటలోని మామిడిపండ్లను పంపుతాడా లేక కొందరికే పంపుతాడా? అసలు పవన్ ఈసారి మామిడిపండ్లు పంపుతాడా లేడా అనేది ఆయన అభిమానుల అంచనాలను అందకుండా ఉండిపోయింది.ఇక సినిమాల పరంగా పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు