పవన్ ఇది ఊహించలేకపోయారా ?

పవన్ కళ్యాణ్ అంటే ఆ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.పవన్ సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, సినిమా హిట్టయినా, ప్లాపయినా, రాజకీయాల్లో సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా, ఇలా ఏమైనా పవన్ కి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.

 Pawan Kalyan Unhappy With Bjp Alliance-TeluguStop.com

పవన్ అంటే ఒక వ్యసనం అన్నట్టుగా ఆయన ఫ్యాన్స్ ఉంటారు.ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తారు.

ఆ స్థాయిలో పవన్ కు క్రేజ్ ఉన్నా రాజకీయాల్లో ఫెయిల్ అవ్వడానికి అనేక వ్యూహాత్మక తప్పిదాలు కారణంగా కనిపిస్తున్నాయి.మొదటి నుంచి రాజకీయంగా చేసిన చిన్న చిన్న తప్పిదాలు ఇప్పటికీ పవన్ ను వెంటాడుతున్నాయి.

అంతే కాదు ఆయన రాజకీయ ఎదుగుదలకు సైతం అవరోధాలుగా మారాయి.ఇప్పుడు రాజకీయంగా పవన్ పై చేయి సాధిద్దామని చూస్తున్నా అదే రకమైన అవరోధాలు ఆయనకు అడ్డం పడుతున్నాయి.

జనసేన పార్టీని స్థాపించిన తరువాత పవన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనకడుగు వేశారు.అప్పుడు తనకు బలం సరిపోదని భావించారు.కానీ బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు.అంతే కాదు ఆ రెండు పార్టీలకు మద్దతుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు.

ఆ కూటమి అధికారంలోకి వచ్చింది.ఇంతవరకు బాగానే ఉన్నా, ఆ తరువాత ఏపీలో పవన్ సొంతంగా ఎదుగుదామని చూసినా ఆ ముద్ర జనాల్లోనూ జనసేన పార్టీ మీద బలంగా పడిపోయింది.

జనసేన అంటే టీడీపీ అనుబంధ పార్టీ, పవన్ బాబు చెప్పినట్టు వినే వ్యక్తి అనే ముద్ర జనాల్లోకి వెళ్ళిపోయింది.ఇది జనసేన పార్టీకి తీరని నష్టం చేకూర్చింది.

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ జనాలకు ఇదే రకమైన అనుమానాలు కలిగాయి.ఫలితాలు ఘోరంగా వచ్చాయి.

Telugu Bjp Alliance, Janasena, Pawan Kalyan, Pawan-Telugu Political News

ఇక అప్పుడు పవన్ కు అసలు విషయం ఏంటో బోధపడింది.మరో నాలుగున్నరేళ్ల పాటు పార్టీని నడపడం అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులే ఎదుర్కోవాలని పవన్ భావించారు.అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.కానీ పొత్తు పెట్టుకున్నామని భావన అందరిలోనూ వ్యక్తం అయ్యింది.ఒంటరిగా ఎదగాల్సిన జనసేన ఇప్పుడు బీజేపీతో కలవడంతో పార్టీకి ఉన్న ఇమేజ్ చాలా వరకు దెబ్బతింది.ఇపుడు జనసేన ఒంటరిగా ఎటువంటి కార్యక్రమం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

బీజేపీతో కలిసిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలేవీ లేవు.పవన్ సినిమాల్లో బిజీ అయ్యారు.

పార్టీలో ఉన్న ఒకరిద్దరు మాత్రమే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

దీంతో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు చాలా అసంతృప్తితో ఉన్నారు.పవన్ లోనూ అనవసరంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను అనే భావన ఎక్కువగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube