అదిగో డౌటు ... ఇదిగో ట్విట్ ! పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జనసేనాని

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు అంశంపై క్లారిటీ ఇచ్చేశారు వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళుతుందని తమకు ఎవరి సహకారం అవసరం లేదని ఒంటరిగానే మా సత్తా చూపిస్తాం అన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు అంతేకాదు గత కొంతకాలంగా వైసీపీ తో జనసేన పొత్తు పెట్టుకోబోతోంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో పవన్ ఈ విధంగా ట్విట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఆదివారం ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్లో పొత్తులు గురించి వస్తున్న వార్తలపై ఘాటుగానే స్పందించారు.

 Pawan Kalyan Tweets On Alliance In Ap 2019 Elections-TeluguStop.com

జనసైన్యంలో మరింత ఉత్సాహం రేకెత్తిస్తూ.పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

‘‘అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, జనసేన.ఆ పార్టీ తో కలుస్తుంది, ఈ పార్టీ తో కలుస్తుందంటూ కొందరు అంటే, కలవడం ఏంటీ? సీట్ల సర్దుబాటు కూడా అయిపాయిందని ఇంకొందరు అంటున్నారు.మనకి ఏ పార్టీ అండ దండా అక్కర్లేదు.మన బలం జనం, చూపిద్దాం ప్రభంజనం” అని పవన్ ట్వీట్ చేశారు.పవన్ ఇచ్చిన ఈ క్లారిటీ తో వచ్చే ఎన్నికల్లో జనసేన ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలో దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.అయితే, భవిష్యత్తులో పవన్ ఇదే ‘ట్రెండ్’ కొనసాగిస్తారా లేదా అనేది చూడా మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

పవన్ అకస్మాత్తుగా ఈ క్లారిటీ ఇవ్వడం వెనుకు ఉన్న రాజకీయ పరిణామాలు ఏంటి అనేది ఇప్పుడు అందరిలోనూ సందేహం రేకెత్తిస్తోంది.జగన్‌ నాకు శ్రతువు కాదు అని ఆ మధ్యన పవన్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.ఇక టీడీపీతో పోలిస్తే.బీజేపీపైనా పెద్దగా విమర్శలు చేయడం లేదు అనే అభిప్రాయం ఉంది.దీంతో వైసీపీ, బీజేపీతో జనసేన పొత్తు ఖాయం అనే టాక్ మొదలైంది.అప్పట్నుంచి జగన్-పవన్-బీజేపీ పొత్తులపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఆ ఊహాగానాలకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు.అయితే ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోయినా … ఎన్నికల ఫలితాల అనంతరం ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది.

మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube