ఏపీ ప్రజలని తప్పుదోవ... ఆంథ్రాక్స్ పేరిట పిట్టకధ..ఇదేమి రాజకీయం పవనూ!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఉత్తరాంధ్ర రాజకీయాలమీద దృష్టి సారించారు.ఇక్కడి ప్రజలకి ఏమి జరిగినా నేను ఊరుకోను చొక్కా పట్టుకుని లాగుతా అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

 Pawan Kalyan Tweet On Anthrax-TeluguStop.com

ఉత్తరాంధ్ర వాళ్ళు వలసలు వెళ్లి పోతున్నారు వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.వారు అలా వెళ్ళడానికి ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీలోని ఉత్తరాంధ్ర నాయకులు అని అర్థం అవుతోంది అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలతో పెద్ద ఉద్యమమే రేపెలా ఉన్నారని నిఘావర్గాల అంచనా అయితే ప్రజలు అందరూ మూకుమ్మడిగా కదిలి రావాలి అంటే.

వారిలో అభద్రతా భావం కలిగించాలి.వారిలో ప్రాణ భీతి.భవిష్యత్తుపై బెంగ గనుకా కలిగితే తప్పకుండా వారు పవన్ తో జట్టు కట్టడానికి సిద్దం అవుతారు.అందుకే జనసేన అధికారంలోకి వస్తే వలస కూలీలని మళ్ళీ ఉత్తరాంధ్ర రప్పిస్తాము ఒక హెక్టార్ భూమిని ఇస్తాను అంటూ వాగ్దానాలు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.అంతేకాదు ఉత్తరాంధ్ర లో ఒక బలమైన ఉద్యమాన్ని రేపడానికి పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారని తెలుస్తోంది.

అయితే ఉద్యమాన్ని రేపాలి అంటే ఏజెన్సీ ప్రజల మద్దతు ఎంతో అవసరం.అయితే వారి మద్దతు ఎలా కూడగట్టాలి.? వారిని ఎలా సమాయుత్తం చేయాలి.? అంటే దానికి పవన్ కళ్యాణ్ ఓ వ్యూహాన్ని రచించారు.అందులో భాగంగానే వారిని భయబ్రాంతులకి గురిచేసేలా.ట్విట్టర్ లో పిట్ట కధ పోస్ట్ చేశారు.

ఈ పిట్ట కధలో ఎన్నో అబద్దాలు.మరెన్నో ఆలోపణలు…నేను చదివింది ఇంటర్ ఫెయిల్ కానీ ప్రపంచాన్ని చదివేశాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారికి ఆంథ్రాక్స్ గురించి కనీస అవగాహన లేకుండా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టడం ఎంతవరకూ సబబు.

తమ రాజకీయాల కోసం ఏజెన్సీ ప్రజలని భయబ్రాంతులకి గురించేయడం ఎంతవరకూ సమంజసం.? పోలిటిక్స్ లో క్లీన్ రాజకీయాలు చేస్తానని చెప్పే పవన్ ఇలాంటి రాజకీయాలు చేయడం ఎంతో దారుణమైన విషయం.ఇంతకీ పవన్ కళ్యాణ్ పోస్ట్ యోక్క్ సారాంశం ఏమిటంటే.

ఆంథ్రాక్స్ ని కావాలనే ఏజెన్సీ ఏరియాలో ప్రజలకి వచ్చేలా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని…ఒక పౌడర్ లాంటి పదార్ధాన్ని జల్లడం వాలన దాని ద్వారా ఏజెన్సీ ఏరియా లో ఈ వ్యాది ప్రభలుతోంది.

ఇలా ప్రజలు ఈ వ్యాధి భయంతో ఏజెన్సీ విడిచి బయటకి వచ్చేస్తే అక్కడి సహజ సంపదా.గ్రనేట్.బాక్సైట్ లని దోచుకోవచ్చానే ఉద్దేశ్యంతో ఉన్నారని ఒక ప్రచారాన్ని ట్విట్టర్ వేదికా చేస్తున్నారు అయితే ఇక్కడ అసలు వాస్తవం ఏమిటంటే ఆంథ్రాక్స్ అనేది ఒక పౌడర్ రూపంలోనో లేదంటే ఒక పదార్ధం రూపంలో వచ్చే జబ్బు కాదు.ఆంథ్రాక్స్ అనేది పశువుల నుంచీ మనుషులకి ఎక్కువగా వ్యాపిస్తుంది.

పశువుల చర్మం పైన జుట్టు ,గాయాల నుంచీ మనుషుల ఊపిరితిత్తులలోకి ప్రవేశించి తద్వారా మనిషికి వ్యాపిస్తుంది అంతేకాని ఎవరో తీసుకు వచ్చి డంప్ చేస్తే వచ్చే జబ్బు కాదు ఆంథ్రాక్స్ అనేది.

అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా ఆలోచించాలి అదేంటంటే.

ఆంథ్రాక్స్ అనేది పవన్ చెప్పిన ఏజెన్సీ ప్రాంతాలలో ఏళ్ళకి తరబడి ఉంటోంది.దానిమీద ఇప్పటికీ రీసెర్చ్ లు ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరుపుతూనే ఉన్నారు.

అయితే ఆంథ్రాక్స్ ని రాజకీయ లబ్ధికోసమే అక్కడ ప్రభాలేలా చేస్తే మరి ఆంథ్రాక్స్ కంటే ఎక్కువగా ఏజెన్సీ ఏరియా లో మలేరియా.వ్యాపిస్తుంది మరి ఇది కూడా ఎవరో తీసుకువచ్చే జబ్బేనా.? ఆంథ్రాక్స్ కంటే కూడా ఎంతో ప్రమాదకరమైన జబ్బులు ఏజెన్సీ లలో ప్రభలుతున్నాయి మరి వాటి మాట ఏమిటి.? ఎంతో క్లీన్ పోలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ ఇలాంటి ట్వీట్ లు చేసి తను చేయాలనీ అనుకున్న ఉద్యమాని పక్కదారి పట్టించుకుని తన చిత్తశుద్దిపై మేధావులకి.విద్యావంతులకి సందేహం కలిగించేలా చేసుకోక పోవడమే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube