పవన్ ఆఫర్ కు నో చెప్పిన త్రివిక్రమ్..?  

hero pawna kalyan hurted with director trivikram srinivas behavior Pawan Kalyan, Trivikram, Agnathavasi, Jalsa, Ram, Sagar Chandra, Ayyapanum Koshiyam - Telugu Agnathavasi, Ayyapanum Koshiyam, Jalsa, Pawan Kalyan, Ram, Sagar Chandra, Trivikram

స్టార్ హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే.పవన్ ఎంపిక చేసుకునే సినిమాల విషయంలో, పవన్ తీసుకునే కీలక నిర్ణయాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర తప్పకుండా ఉంటుందని సినిమా ఇండస్ట్రీలో చాలామంది చెబుతూ ఉంటారు.

TeluguStop.com - Pawan Kalyan Trivikram Agnathavasi

పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన జల్సా హిట్ కాగా అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.

అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని పవన్ త్రివిక్రమ్ అభిమానులు భావిస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బిజీగా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రామ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.

TeluguStop.com - పవన్ ఆఫర్ కు నో చెప్పిన త్రివిక్రమ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పవన్ ఇప్పటికే వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉండగా రెండు రోజుల క్రితం అయ్యప్పునుమ్ కోషియుమ్ అనే మలయాళ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నాడు.

అయితే ఈ సినిమాకు పవన్ మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ ను దర్శకత్వం వహించమని కోరాడని అయితే త్రివిక్రమ్ మాత్రం పవన్ ఆఫర్ కు నో చెప్పాడని సమాచారం.తనకు రీమేక్ సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని త్రివిక్రమ్ సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించారని సమాచారం.

అయితే త్రివిక్రమ్ దర్శకత్వం వహించకపోయినా అయ్యప్పునుమ్ కోషియుమ్ కథ, కథనాల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోనున్నాడని సమాచారం.

పవన్ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

సినిమాలోని మరో పాత్రలో రానా నటించనున్నట్టు వార్తలు వస్తున్నా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు.సితార ఎంట్ఱర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లు అన్నీ పూర్తైన తరువాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

#Pawan Kalyan #Sagar Chandra #Agnathavasi #Trivikram #Jalsa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Trivikram Agnathavasi Related Telugu News,Photos/Pics,Images..