రేపు పవన్ బెజవాడ పర్యటన ! ఎందుకో..?   Pawan Kalyan Tour Will Vijayawada From Tomorrow     2018-11-09   14:52:18  IST  Sai M

ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పోరాటయాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం విజయవాడ చేరుకోనున్నారు… రెండు రోజుల పాటు బెజవాడలోనే బసచేయనున్న జనసేన చీఫ్… పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 12వ తేదీ నుంచి తిరిగి ప్రజా పోరాట యాత్రలో పాల్గొనున్నారు పవన్ కల్యాణ్. కాగా, పోరాట యాత్రలో పవన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అంతే కాదు ఇటీవల పవన్ టార్గెట్ గా బెజవాడ లో ఫ్లెక్సీ రాజకీయం రచ్చకెక్కింది.. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా టీడీపీ టీడీపీ టార్గెట్ గా జనసేన ఇలా ఒకరికి ఒకరు ఫ్లెక్సీలతో విమర్సించుకున్నారు. ఈ వ్యవహారంపై పవన్ కూడా ఆరా తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ బెజవాడ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.