పవన్ కళ్యాణ్ అలా చేయబోతున్నాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆయన నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అయ్యింది.

 Pawan Kalyan To Tonsure Head For Krish, Pawan Kalyan, Krish, Pspk27, Viroopaksha-TeluguStop.com

ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో పవన్ మరోసారి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెట్టేందుకు పవన్ రెడీ అయ్యాడు.

ఇప్పటికే దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తన నెక్ట్స్ చిత్రాన్ని ప్రారంభించాడు.

ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో పవన్ లుక్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉండబోతుందని తెలుస్తోంది.ఈ సినిమాలో పవన్ అనేక లుక్స్‌లో కనిపిస్తాడని, అందులో భాగంగా గుండు లుక్‌లో పవన్ కనిపించనున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం పవన్ నిజంగా గుండు కొట్టించుకునేలా దర్శకుడు క్రిష్ ఆయన్ను ఒప్పించాడట.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తమ అభిమాన హీరో నిజంగా సినిమా కోసం గుండు చేసుకుంటాడా అని వారు ప్రశ్నిస్తున్నారు.ఏదేమైనా సినిమా కోసం తాను ఏం చేయడానికైనా రెడీ అంటోన్న పవన్ మరి క్రిష్ డైరెక్షన్‌లో రాబోయే సినిమాలో నిజంగా గుండు లుక్‌లో కనిపిస్తాడా అనేది చూడాలి.

ఇక ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయాలని చూస్తోంది.ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై ఇంకా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube