లాక్‌డౌన్ దెబ్బకు ప్లాన్ మార్చిన పవన్  

Pawan Kalyan To Start Harish Shankar Movie Befor Krish Movie - Telugu Harish Shankar, Krish, Pawan Kalyan, Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ చాలా బిజీగా మారాడు.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పవన్, మరో రెండు సినిమాలను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.

 Pawan Kalyan To Start Harish Shankar Movie Befor Krish Movie

ఈ క్రమంలో తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు పవన్ ఇప్పటికే పచ్చజెండా ఊపాడు.కాగా ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, లాక్‌డౌన్ ముగియగానే సినిమాను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ కావడంతో ఈ సినిమా షూటింగ్ చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.దీంతో ఈ సినిమా కంటే ముందే మరో సినిమాను స్టార్ట్ చేయాలని పవన్ భావిస్తున్నాడట.

లాక్‌డౌన్ దెబ్బకు ప్లాన్ మార్చిన పవన్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తన నెక్ట్స్ మూవీని గబ్బర్‌సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయిన పవన్, ఈ సినిమా మాస్ ఎంటర్‌టైనర్‌గా రానుండటంతో ఈ సినిమానే ముందుగా తెరకెక్కించాలని చూస్తున్నాడట.

మొత్తానికి లాక్‌డౌన్ దెబ్బకు పవన్ తన ప్లాన్‌ను పూర్తిగా మార్చినట్లు తెలుస్తోంది.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం సినిమా ప్రారంభం అయ్యే వరకు ఆగాల్సి ఉంది.కాగా పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రాన్ని లాక్‌డౌన్ ముగియగానే వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి కమ్‌బ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan To Start Harish Shankar Movie Befor Krish Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test