వరుణ్ తేజ్ బ్యూటీతో పవన్ రొమాన్స్.. అంతా ఆయన పుణ్యమే!  

Pawan Kalyan To Romance Pragya Jaiswal-pawan Kalyan,pragya Jaiswal,telugu Movie News,tollywood

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో ఫుల్ జోష్‌లో ఉన్న పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్, తన నెక్ట్స్ మూవీని కూడా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

Pawan Kalyan To Romance Pragya Jaiswal-Pawan Pragya Jaiswal Telugu Movie News Tollywood

ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

తమిళ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నంతో సినిమా చేసేందుక పవన్ గతంలోనే అంగీకరించడంతో ఆ సినిమాకు దర్శకుడిగా క్రిష్‌ను ఎంపిక చేశారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యా్ణ్ సరసన హీరోయిన్ ఛాన్సును ఫేడవుట్ అయ్యేందుకు రెడీగా ఉన్న బ్యూటీకి లభించినట్లు తెలుస్తోంది.వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు లేకుండా ఉంది.

దీంతో తనకు ఒక్క అవకాశం ఇప్పించాలని కంచె డైరెక్టర్ క్రిష్‌ను ఆమె కోరడంతో పవన్ సరసన నటించే ఛాన్స్ ఇప్పించేందుకు రెడీ అయ్యాడట క్రిష్.

మరి ఫేడవుట్ అవుతున్న బ్యూటీతో పవన్ కళ్యాణ్ నటిస్తాడా లేడా అనేది డౌటే.

ఏదేమైనా క్రిష్ సాహసానికి సినీ జనం ఔరా అంటున్నారు.ఇక ఈ సినిమాను జనవరి 27న ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

మరి ఈ సినిమాలో పవన్ సరసన ఎవరు నటిస్తారనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్‌ అనే చెప్పాలి.

తాజా వార్తలు

Pawan Kalyan To Romance Pragya Jaiswal-pawan Kalyan,pragya Jaiswal,telugu Movie News,tollywood Related....