చరణ్ కోసం పవన్ అలా మారుతున్నాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఈ స్టార్ హీరో.

ఇక బాలీవుడ్ చిత్రం ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమా తరువాత దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు పవన్.

కాగా కేవలం హీరోగా మాత్రమే కాకుండా అటు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పవన్ రెడీ అయ్యాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే ఓ సినిమాను పవన్ స్వయంగా ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

చరణ్ నెక్ట్స్ చిత్రం కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడట ఈ స్టార్ డైరెక్టర్.

రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తయ్యాక ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది.

అటు హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి లాభాలను తెచ్చుకోవాలని పవన్ ఆలోచిస్తున్నాడు.

దీంతో పవన్-త్రివిక్రమ్ కాంబో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈసారి హీరోగా కాకుండా నిర్మాతగా మారి త్రివిక్రమ్‌తో ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు పవర్ స్టార్.

మరి ఈ సినిమాను ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు పట్టాలెక్కిస్తారు అనే అంశాలు తెలియాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తీవ్ర ఉద్రిక్తత