చరణ్ కోసం పవన్ అలా మారుతున్నాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఈ స్టార్ హీరో.

 Pawan Kalyan To Produce Charan Movie, Pawan Kalyan, Vakeel Saab, Viroopaksha, Tr-TeluguStop.com

ఇక బాలీవుడ్ చిత్రం ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమా తరువాత దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు పవన్.

కాగా కేవలం హీరోగా మాత్రమే కాకుండా అటు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పవన్ రెడీ అయ్యాడు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే ఓ సినిమాను పవన్ స్వయంగా ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు.చరణ్ నెక్ట్స్ చిత్రం కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడట ఈ స్టార్ డైరెక్టర్.

రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తయ్యాక ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది.

అటు హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి లాభాలను తెచ్చుకోవాలని పవన్ ఆలోచిస్తున్నాడు.

దీంతో పవన్-త్రివిక్రమ్ కాంబో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈసారి హీరోగా కాకుండా నిర్మాతగా మారి త్రివిక్రమ్‌తో ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు పవర్ స్టార్.

మరి ఈ సినిమాను ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు పట్టాలెక్కిస్తారు అనే అంశాలు తెలియాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube