హరీష్ శంకర్ సినిమాలో పవన్ అలా కనిపిస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడులో దూసుకుపోతున్నాడు.ఇప్పటికే తన నెక్ట్స్ మూవీ భీమ్లా నాయక్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న పవన్, ఆ తరువాత మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు.

 Pawan Kalyan To Play Nationalist In Harish Shankar Movie, Pawan Kalyan, Harish S-TeluguStop.com

ఈ జాబితాలో దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో రాబోయే హరిహర వీరమల్లు, దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమాతో పాటు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమా కూడా ఉంది.ఇక దర్శకుడు హరీష్ శంకర్‌తో గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పవన్, ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో రోజుకో వార్త వినిపిస్తోంది.తాజాగా ఈ సినిమాలో పవన్ పాత్రకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో పవన్ ఓ జాతీయవాది వ్యక్తిగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆలోచంపజేసేలా కనిపిస్తాడని తెలుస్తోంది.దేశ రాజకీయాలపై తనదైన మార్క్‌తో పవన్ ఈ సినిమాలో పోరాటం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కమర్షియల్ అంశాలను పుష్కలంగా వాడటంతో పాటు ఓ చక్కటి మెసేజ్ కూడా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా పవన్ రాజకీయ ప్రస్థానానికి కూడా బాగా ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.

మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈసారి సినిమాతో పాటు రాజకీయంగా కూడా ప్రేక్షకులను ఆలోచింపజేసేందుకు రెడీ అవుతుండటంతో, ఆయన అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాకు ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాలో పవన్ పాత్ర ప్రేక్షకులపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube