మహేష్ పరువు తీసేలా ఉన్న పవర్ స్టార్

బ్రహ్మోత్సవం అనే ఒక చిత్రం ఎంత పని చేసింది ? మహేష్ కి, అభిమానులకి, పంపిణిదారులకి నిద్రలేని రాత్రులు ఇస్తూనే, మహేష్ బాక్సాఫీస్ స్టామినాని ప్రపంచం ప్రశ్నించేలా చేసింది.సినిమా ఎలాగో డిజాస్టర్ కాని, మహేష్ ఫ్లాప్ సినిమాలకి వచ్చే ఓపెనింగ్స్ బ్రహ్మోత్సవం కి రాలేదు.

 Pawan Kalyan To Insult Mahesh At Boxoffice-TeluguStop.com

అప్పటికి టాప్ 4 ఓపెనింగ్ అయినా, ఆ తరువాత జనత గ్యారేజ్, ఖైది నం 150 చిత్రాలు వచ్చి బ్రహ్మోత్సవం ఓపెనింగ్ ని టాప్ 5 నుంచి బయటకి తోసేశాయి.ఇప్పుడు టాప్ 5 ఓపెనింగ్స్ లో మహేష్ చిత్రం ఒకటే ఉంది.

అది కూడా శ్రీమంతుడు.ఇప్పుడు అది కూడా టాప్ 5 నుంచి బయటకి తోయబడుతుంది.

ఎందుకంటే కాటమరాయుడు వస్తోందిగా .పవర్ స్టార్ ఎలాగో టాప్ 1 లేదా టాప్ 2 ఓపెనింగ్ ఇస్తాడు .దాంతో మహేష్ ఖాతాలో మిగిలిపోయిన శ్రీమంతుడు కూడా టాప్ 5 లో ఉండదు.మహేష్ స్టార్ హీరోగా ఎదిగాక ఇంత అవమానకరమైన సంఘటన జరగటం ఇదే తొలిసారి.

ఆ ఫ్యామిలి సినిమాకి బదులు ఏదైనా యాక్షన్ సినిమా చేసుంటే మహేష్ కి ఈ దుర్గతి పట్టేది కాదు, ఆగడు లాగే సినిమా ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉండేవి.కాని అనుకోని సంఘటన జరిగిపొయింది.

రేపటితో మహేష్ పరువు, గాలి రెండు తీసేస్తాడు పవర్ స్టార్.టాప్ 5 మొదటి రోజు కలెక్షన్లలో రెండు పవన్ సినిమాలు, బాహుబలి, ఒక చిరంజీవి సినిమా మరొకటి ఎన్టీఆర్ సినిమా ఉంటాయి.

మహేష్ అభిమానులకి ఇది మింగుడుపడని విషయమే.

తన 23 చిత్రం మొదటిరోజు రికార్డులు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, జూన్ వరకు మహేష్ కి, మహేష్ ఫ్యాన్స్ కి ఈ అవమానభారం తప్పదు.

మరి మురుగదాస్ వంద కోట్లతో ఏం చెక్కుతున్నాడో కాని ప్రిన్స్ అభిమానుల ఆశలన్నీ ఆయనపైనే ఉన్నాయి.అయితే, ప్రీ రిలీజ్ బిజినెస్ లో మహేష్ 23 ఇప్పటికే రికార్డుల వేట మొదలుపెట్టడం కాస్తంతా ఊరట కలిగించే విషయం .పాపం కదా మహేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube