ఎనిమిదేళ్ల తరువాత ఆ ఫీట్ కొడుతున్న పవన్  

pawan kalyan to have 2 releases after 8 years - Telugu Krish, Pawan Kalyan, Vakeel Saab, Venu Sriram, Virupaksha

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీ-ఎంట్రీతో అదిరిపోయే హిట్లు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్, ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టి ప్రేక్షకులు ఫస్ట్ లుక్‌తో గిఫ్ట్ ఇచ్చాడు.

 Pawan Kalyan To Have 2 Releases After 8 Years

ఇక తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పవన్, త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.

అయితే ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసేందుకు పవన్ పక్కా ప్లాన్ చేస్తు్న్నాడు.గతంలో కూడా పవన్ ఇలాంటి ఫీట్ పలుమార్లు చేశాడు.1998లో సుస్వాగతం, తొలిప్రేమ సినిమాలను రిలీజ్ చేస్తే ఆ రెండూ సూపర్ హిట్‌గా నిలిచాయి.2006లో బంగారం, అన్నవరం సినిమాలు, 2011లో పంజా, తీన్‌మార్, 2012లో గబ్బర్‌సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలను రిలీజ్ చేశాడు.

ఎనిమిదేళ్ల తరువాత ఆ ఫీట్ కొడుతున్న పవన్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇలా ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేసి రెండు చిత్రాలను హిట్‌గా మలిచిన ఘనత పవన్‌ సొంతం.దీంతో 2020లో కూడా పవన్ ఇదే స్ట్రాటజీతో రెండు సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా వాటిని సూపర్‌హిట్లుగా మలిచేందుకు రెడీ అవుతున్నాడు.

మరి ఎనిమిదేళ్ల తరువాత డబుల్ ట్రీట్ ఇస్తున్న పవన్, ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటాడో చూడాలి.

#Vakeel Saab #Venu Sriram #Krish #Virupaksha #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan To Have 2 Releases After 8 Years Related Telugu News,Photos/Pics,Images..