పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్‌ను ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అదిరిపోయే రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు.

 Pawan Kalyan To Give Double Treat, Pawan Kalyan, Vakeel Saab, Venu Sriram, Dil R-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్‌’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమా టీజర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే అదే రోజున మరో గిఫ్ట్ ఇచ్చేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న పవన్, ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అంటే ఈసారి పవన్ పుట్టినరోజున రెండు బహుమతులు రానున్నాయని తెలుసుకుని పవన్ ఫ్యాన్స్ సంతోషంతో ఊగిపోతున్నారు.

ఇప్పటికే పవన్ పుట్టినరోజును సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ట్రెండింగ్ చేస్తూ తమ సత్తా చాటుతున్న వారు, ఇక రెండు బహుమతలకు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube