అనుకున్న దానికంటే స్పీడుగా వెళ్తున్న పవన్  

Pawan Kalyan To Finish Krish Movie Very Soon, Pawan Kalyan, Krish, PSPK27, Tollywood News - Telugu Krish, Pawan Kalyan, Pspk27, Tollywood News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో దాదాపు రెండేళ్ల తరువాత పవన్ అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - Pawan Kalyan To Finish Krish Movie Very Soon

ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఎప్పుడో ప్రారంభించిన చిత్ర యూనిట్, ఇప్పటికే కొంతమేర షూటింగ్ కూడా జరుపుకుంది.

కాగా తాజాగా పవన్ ఈ సినిమా షూటింగ్‌లో మళ్లీ పాల్గొంటున్నాడు.

TeluguStop.com - అనుకున్న దానికంటే స్పీడుగా వెళ్తున్న పవన్-Gossips-Telugu Tollywood Photo Image

దీంతో ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న పవన్ ఈ మేరకు చిత్ర యూనిట్‌కు సూచించినట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఏకధాటిగా జరిపి పూర్తి చేసేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా కథను తీర్చిదిద్దుతున్న క్రిష్, ఈ సినిమాలో పవన్‌ను రాబిన్‌హుడ్ తరహా పాత్రలో చూపెట్టబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది.

అనుకున్న దానికంటే స్పీడుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో వేసవి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చిత్ర యూనిట్ అంటోంది.నిజంగానే ఈ సినిమా షూటింగ్‌ను పవన్ కళ్యాణ్ అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేస్తాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను పెడతారా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.

#Krish #Pawan Kalyan #PSPK27

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు