పవన్ కోసం ఆల్‌మిక్స్ చేస్తోన్న డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం వకీల్ సాబ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

 Pawan Kalyan To Entertain Complete, Pawan Kalyan, Harish Shankar, Gabbar Singh,-TeluguStop.com

ఇక ఈ సినిమా పీరియాడికల్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడ అవుతోంది.

అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని మరోసారి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు పవన్.

ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు హరీష్ శంకర్ రెడీ అవుతున్నాడట.ఈ సినిమాలో గబ్బర్ సింగ్ చిత్రంలోని మెజారిటీ అంశాలను మరోసారి రిపీట్ చేయాలని చూస్తున్నాడు డైరెక్టర్.

ఈ మేరకు పవన్‌తో డిస్కషన్ కూడా జరిగిందట.

అటు ఎంటర్‌టైనింగ్ పాత్రలో నటిస్తూనే పొలిటికల్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా పవన్ కనిపిస్తాడని తెలుస్తోంది.

ఈ సినిమాతో పవన్ రాజకీయంగా కూడా ప్రజలను టచ్ చేయడం ఖాయమని తెలుస్తోంది.ఇక పవన్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube